39.2 C
Hyderabad
Monday, April 22, 2024
Homeకవితలు - రాతలుఆమె ఒక నది అని ఎవరికి తెలుసు?

ఆమె ఒక నది అని ఎవరికి తెలుసు?

Date:

Related stories

నవభారత వికాస దార్శనికుడు….

(ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం) నవ భారత...

ఇందూర్ ఎంపీ ఆర్వింద్ ధర్మపురిని కలిసి ధన్యవాదాలు తెలిపిన BJYM రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయకుడు.సంతోష్ కుమార్

ఇటీవలే ప్రకటించిన BJYM కమిటీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమింపబడిన నాయకుడు సంతోష్...

శీర్షిక: మున్నూరు కాపులము

సాయం అయ్యేటి వ్యవసాయం చేసేము..పంటకు కాపు సైనిక సేవకులమురాజ్య రక్షణలో సాటిలేని...

తెలంగాణ మున్నూరుకాపు మరియు విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తెలంగాణ మున్నూరుకాపు మరియు విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ...
spot_imgspot_img

పుస్తకావిష్కరణ కార్యక్రమం నిన్న సాయంత్రం 8.00 ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో కవి సంగమం వ్యవస్థాపకులు శ్రీ కవి యాకూబ్ సార్ అధ్యక్షతన జరిగింది.యాకూబ్ సార్ కవిత్వ సంపుటి కి మానస చామర్తి రాసిన ముందు మాటలను వివరిస్తూ “unfiltered” కవిత్వాన్ని పద్మజ “own “చేసుకుంది.చిత్రిక పట్టడం,నగిషీలు చెక్కడం,ఈ కవిత్వ సంపుటి ఉద్దేశ్యం కాదు.అనే మాటను కోట్ చేస్తూ మా పద్మజ కవిత్వం చెక్కి, చెక్కి, చెక్కి చేసిన కవిత్వం కాదు ఆమె అనుభవాలను నమోదు చేయడమే ఆమె కవిత్వం అని ఆత్మీయంగా ప్రారంభిస్తూ…..

ఆవిష్కరణ కొరకై జంబో గారిని ఆహ్వానించారు
ఇందులో పెద్దలు ఆత్మీయులు కవి, కథా రచయిత
డైరెక్టర్, తెలంగాణ జ్యుడీషియల్ అకాడెమీ
శ్రీ మంగారి రాజేందర్ (జింబో)
గారు పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ
సంపుటి లోని “నా మాట” గురించి ప్రస్తావిస్తూ అందులో
ఆమె అమ్మ ఎప్పటికీ నాకు ఇష్టమైన శత్రువే!
అని రాసుకున్న లైన్ ఆమె లోని
కచ్చితమైన స్వభావాన్ని నిర్మొహమాటంగా దాచుకొలేని భావాన్ని వ్యక్తపరిచే కవిత్వమని
ఈ పుస్తకం గురించి
ఆత్మీయ ప్రసంగం చేశారు

విశిష్ట అతిథి కుప్పిలి పద్మ గారు స్త్రీలు రాస్తున్న కవిత్వాన్ని వివరిస్తూ
ఈ పుస్తకంలోనీ
మూడవ పేజ్ లో
“కవిత్వం,కథలుగా ప్రకటించుకున్న తన అస్తిత్వానికి
ఇప్పటికీ రాయబడని ప్రశ్నించే ఆమె లందరికీ”
అన్న మాటను ఉద్దేశించి ఈ పుస్తకం ఆమెలందరికి అంకితం చేయబడిందనీ
కవిత్వ నేపథ్యాన్ని
స్త్రీలు సామాజిక విషయాల పట్ల కవిత్వం చేయడాన్ని అభినందించారు

సమీక్షకులు శ్రీరామ్ పుప్పాల గారు కవిత్వ సంపుటి లోని కవితల గురించి జెండర్ సెన్సిబిలిటీ గురించి,అనువాదాల గురించి తనదైన శైలిలో సమీక్షించారు.

OU ప్రొఫెసర్ కవి,విమర్శకులు
శ్రీ డాక్టర్.s. రఘు గారు కవిత్వ సంపుటి లో నా మాటలో ఆమె రాసుకున్న ఆమె కవిత
” ఆమె కవి కాదు
ఆమెకు కవిత్వం రాదు
ఆ చదువు పై మమకారం సావక రాత్రుళ్ళు నిద్రలో మేల్కొని వెక్కి వెక్కి ఏడ్చిన అబాగ్యురాలు ఆమె
సాయంత్ర సమీరం ఆమె
సాగర తీరం ఆమె
సంధ్యా రాగం ఆమె
ఆ ఆమె ను నేనే “

నని రాసుకున్న కవితలో…ఆమె
ఎప్పటికీ అబాగ్యురాలు కాదు
ఆమెతో పాటు అనేక మందికి స్ఫూర్తి నిచ్చే అమ్మాయి ఆమె నని చెప్పినప్పుడు మా అమ్మ కళ్ళల్లోనీ చెమ్మ ఆ ఉద్వేగ భరిత క్షణాలు జీవితంలో ఎప్పటికీ గుర్తు ఉండిపోతాయి.

మా గురువు శ్రీ వెంకట కిషన్
ఇత్యాల గారు మాట్లాడుతూ ఆమె కవిత్వం కొత్త శైలి ఆమెకు నచ్చినట్టు బోల్డ్ గా రాస్తుంది ఇలా రాసేటపుడు ఆమె ఆమె లాంటి రచయిత్రులు ఎక్కడున్నారో అనే విశ్లేషణ మొదలుపెట్టి అమృతా ప్రీఠం,కమలా దాస్,తస్లీమా నస్రీన్,మాయా ఎంజెలో లాంటి పోయెట్స్ తో పాటు అబ్బాస్ కియరోస్తిమి లాంటి పోయెట్స్ ను విశ్లేషించి ఆమె చెప్పాలనుకున్న భావాలను
స్వేచ్చానువాదాలుగా చేసింది
అనే మాటలు చాలా సంతోషాన్ని ఇచ్చాయి.
సభ చివర్లో ఆత్మీయ అతిథి
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ అద్యక్షులు మామిడి హరికృష్ణ సార్ ప్రేమ పూర్వక
అభినందనలు చాలా సంతోషాన్ని ఇచ్చాయి
అందరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు🙏

కవిత్వం ప్రస్థాన విషయానికోస్తే
సరదాగా కొటేషన్స్ రాసి స్టేటస్ లో పెట్టెదాన్ని.
దాన్ని చూసి మా గురువు శ్రీ వెంకట కిషన్ ఇత్యాల గారు నన్ను కవిసంగమం గ్రూప్ లో
జాయిన్ చేశారు.ఆ గ్రూప్ లో పచ్చని చెట్టు యాకూబ్ సార్ శిలాలోలిత మేడం కవిత్వానికి సంభందించిన విషయంలో చేసిన సలహాలు సూచనలు వల్ల మరియు కరోనా సమయంలో కవిసంగమంలో కవి మిత్రుల విస్తృత చర్చలు వల్ల కవిత్వం పట్ల సీరియస్ పెరిగి కవిత్వం రాస్తూనే దేశ విదేశాలకు చెందిన మహిళా రచయిత్రుల కవితలను 30 కి పైగా అనువాదం చేశాను
ఈ రోజు నేను కవిత్వ సంపుటి వేయడానికి కారణమైన వీరికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను.

పుస్తకానికి వెయ్యలనే ఆలోచనలో
కవితలు అమరిక విషయంలో సహాయం చేసిన
శ్రీ రామ్ పుప్పాల గారికి, హృదయ పూర్వక కృతజ్ఞతలు

నరేష్ కుమార్ సూఫీ అయితే కవిత్వాన్ని ఇండిజైన్ వెర్షన్ లో చేసి ఇచ్చాడు దాదాపు మేము ప్రూఫ్ రీడింగ్ లకు పది రోజులు ఉదయం అంతా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నా రోజు రాత్రి పూట 8.00 గంటల నుండి 12.00 వరకు జూమ్ లో జాయిన్ అయ్యి ఈ పుస్తకం మీద వర్క్ చేసాము మావా బ్రో చాలా చాలా థాంక్స్

ఎంతో ఇష్టపడే కవి అఫ్సర్ సార్ అడగగానే బ్లర్బ్ రాసి ఇచ్చి ప్రోత్సహించారు
కుప్పిలి పద్మ గారి కవిత్వం కథలకు నేను మొదటినుండి అభిమానిని మేడం ముందు మాటలు నాకు చాలా అమూల్యమైనవి
కవిత్వంలో తనదైన మార్కును ఎప్పుడూ ఉంచుకునే ప్రసేన్ బెల్లంకొండ గారు ముందుమాట ను రాసి ఇవ్వడం తో పాటు
కార్యక్రమం కోసం బుక్ ఫెయిర్ వాళ్ళతో మాట్లాడి సభకు సహకారం అందించారు
ఆత్మీయ మిత్రురాలు
మానస చామర్తి
ఆత్మీయ వాక్యం ఎంతో సంతోషం అందరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు

టైటిల్ విషయంలో నదీ అనేది
కొండలో కోనల్లో వంపుల్లో నుండి అనేక సుడిగుండాల్లో కూడా ప్రవహిస్తూ చల్లని నీళ్లను ఇస్తుంది ఒక స్త్రీ కూడా ఆమె లోని భావాలు ప్రేమ,భాధ,కోపం, దుఃఖం,విరహం అన్నింటిలో తనకు తానుగా ప్రవహించే
నదీ ప్రవాహమే
ఈ కవిత్వం” ఆమె”లందరి పక్షాన నిలిచి నాదైన స్వరంతో రాసిన కవిత్వం కాబట్టి ఈ టైటిల్ పెట్టాను
ముగ్గురు ఆడపిల్లలు అయినా మమ్మల్ని ఎంతగానో ప్రేమతో చూసుకున్న మా అమ్మ నాన్నకి,
కుటుంబ సమేతంగా మా చిన్న మూడు నెలల పాపతో సభకు వచ్చిన డార్లింగ్ స్వాతి బొలిశెట్టి కి, వనజ జిల్లాల కు ,నన్ను ప్రతీ సభకు తీసుకెళ్ళి ఈ పుస్తకావిష్కరణ వరకు కృషి చేసిన మహేష్ తోట కు బోలెడు కృతజ్ఞతలు🙏

ఆత్మీయ తమ్ముళ్లు తగుళ్ల గోపాల్ కు,
నాగిళ్ళ రమేష్ కు ,నస్రీన్ ఖాన్ మేడం అండ్ సార్ కు, జయ శ్రీ మువ్వా కు,
సరశిజ అక్క రాలేకపోయానని బసవేశ్వర్ బావ గారిని పంపించినందుకు, లైవ్ టెలిక్యాస్ట్ చేసి మరీ చూపించిన బావ గారికి,
పేర్ల రాముకు ,OU నుండి సభ కు వచ్చిన విద్యార్దిని విద్యార్థులకు, ఫేస్బుక్ ఇన్విటేషన్ చూసి లీవ్ పెట్టి మరీ వచ్చాము అని చెప్పిన ఆత్మీయ మిత్రులకు,మిత్రుడు విఠల్ సార్కి, సీదర్ల ఉదయ్ కి,
నా జాన్ స్నేహ కి , సతీ సమేతంగా హాజరైన మహంతి వెంకట్ రావు సార్ కు,మేడం కి,
ప్రో. బాల శ్రీనన్న కు , చామకుర రాజన్న కు, పార్వతి సత్యనారాయణ సార్ కు, డా. పెంచాల సతీశ్ కు , డా.లోలపు తిరుపతి అన్న కు, ఫోటోలు, వీడియో లు తీసి ఇచ్చిన శేషు కు, ఖమ్మం నుండి వచ్చిన ఇబ్రహీం నిర్గున్ సార్ కు, రక్షింద కు, లక్ష్మి నారాయణ బిట్ర సార్ కు,శర్మ గారికి, వచ్చి అభినందనలు తెలిపిన షరతులు వర్తిస్తాయి మూవీ డైరెక్టర్ అక్షర ( కుమార స్వామి) సార్ కి,
కవర్ డిజైన్ మరియు పుస్తకాన్ని ప్రింట్ చేసి ఇచ్చిన బంగారు బ్రహ్మం గారికి,
లోపల కవితలకు బొమ్మలు వేసి ఇచ్చిన ఆర్టిస్ట్ వీరు కు,కవర్ పేజ్ కు ఫోటోలు తీసిన వినోద్ కుమార్ దుర్గం కి,ఆ ఫోటో ను ఎడిట్ చేసి ఇచ్చిన వినోద్ కుమార్ పేట కు,
హృదయ పూర్వక కృతజ్ఞతలు
ఉన్న తక్కువ సమయంలో కూడా సభను అద్భుతంగా నడిపించిన యాకూబ్ సార్ కు
వినయ పూర్వక నమస్సులు🙏

ఇంకా వేదిక కింద కూర్చొని పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వందలాది పాఠకులందరికి పేరు పేరునా కృతజ్ఞతలు

ఈ ప్రోగ్రాం కు రాలేక పోయినా కూడా ఆశీస్సులు తెలిపిన మిత్రులందరికీ ఆత్మీయ బంధువులందరికీ
అందరికీ
హృదయ పూర్వక కృతజ్ఞతలు 🙏
…… ప్రేమతో
మీ పద్మజ బొలిశెట్టి

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here