Home రాజకీయాలు లోకల్ అభ్యర్థులకే ఎంపీ టికెట్లు ఇవ్వాలని డిమాండ్ తో రాజకీయ పార్టీలకు లేఖలు రాసిన మహబూబ్నగర్...

లోకల్ అభ్యర్థులకే ఎంపీ టికెట్లు ఇవ్వాలని డిమాండ్ తో రాజకీయ పార్టీలకు లేఖలు రాసిన మహబూబ్నగర్ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు మున్నూరు రవి

మహబూబ్ నగర్ డెవలప్ మెంట్ ఫోరమ్ ఆధ్వర్యంలో ఈ రోజు స్థానిక పద్మశాలి భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో స్థానిక పార్లమెంటరీ నియోజకవర్గ నాయకులకే ఎంపీ టికెట్ ఇవ్వాలనే ప్రధాన డిమాండ్ తో అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు లేఖలు రాసి పంపడం జరిగింది అని .ఈ విషయంలో అన్ని ప్రధాన పార్టీలకు ,జాతీయ ,ప్రాంతీయ పార్టీలకు లేఖల ద్వారా ఈ డిమాండ్ ని తెలపడం జరిగిందని యం.డి. ఎఫ్ అధ్యక్షులు మున్నూరు రవి తెలిపారు

రాబోతున్న పార్లమెంటు ఎన్నికల్లో స్థానిక అభ్యర్థులకే రాజకీయ పార్టీలు ప్రాధాన్యమిచ్చి ఎంపీ టికెట్లు ఇవ్వాలని, స్థానికేతరులను బలవంతంగా పాలమూరు ఎంపీ సీట్ పై రుద్దాలని చూస్తే తగిన విధంగా గుణపాఠం నేర్పుతామని మహబూబ్నగర్ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షుడు మున్నూరు రవి ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. పార్లమెంటు స్థానం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం రెండుసార్లు మాత్రమే స్థానికులు ఎంపీలు అయ్యారని…. మిగతా సమయాల్లో పూర్తిగా ఇతర ప్రాంతాల వారు ఇక్కడ ఎంపీల ఈ ప్రాంత ప్రజల బాగోగులు పట్టించుకోకుండా ప్రజలను అవస్థల పాలు చేశారని ఆయన మండిపడ్డారు.
మన ఊరు – మన అభివృద్ధి నినాదంతో ముందుకు సాగుతున్న మహబూబ్ నగర్ డెవలప్మెంట్ ఫోరం గ్రామ గ్రామాన తిరిగి ప్రజలను చైతన్యవంతులను చేసి స్థానికులనే ఎంపీ అభ్యర్థులుగా నిలబెట్టేలా రాజకీయ పార్టీలపై అన్ని విధాలుగా ఒత్తిడి తీసుకు వస్తున్నామని మున్నూరు రవి స్పష్టం చేశారు.వలసలు వచ్చే నేతలకు ఈ ప్రాంతం లో ఓట్లు వేయించుకొని ఢిల్లీలో ఊరేగడం తప్ప ఈ ప్రాంత అభివృద్ధి పట్టదని ఆయన మండిపడ్డారు. స్థానికేతర్లు ఎంపీలుగా గెలిచి కనీసం ఇక్కడ క్యాంపు ఆఫీసులో కూడా పెట్టకుండా ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజలకు నరకం చూపించారని… ఇంకా ఇంకా స్థానికేతరులే ఇక్కడికి వస్తే ఈ ప్రాంత ప్రజలు ఏమైపోవాలి అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక అభ్యర్థులకే ఎంపీ టికెట్లు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీ అధినేతలను విజ్ఞప్తులు చేస్తున్నాం అని తమ మాట ప్రజల పక్షణ ఉంటుంది కబ్బటి ప్రజల మాట కాదని ఇంకా స్థానికేతరులకి ఇవ్వాలని ఆయా రాజకీయ పార్టీలు భావిస్తే వారికి తగిన గుణపాఠం నేర్పుతామని మున్నూరు రవి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో
ఎండిఎఫ్ ప్రధాన కార్యదర్శి సారంగి వినయ్ కుమార్,ఉపాధ్యక్షులు
పటేల్ వెంకటేష్ ,జిల్లా అధ్యక్షులు
ముదిరాజ్ సేవ సమితి ముసంగి వెంకటేష్ ,ఎండిఎఫ్ మైనార్టీ విభాగం కన్వీనర్ మహమ్మద్ మసీఉద్దీన్ తదితరులుపాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version