పూరి తమ్ముడు -చక్రి తమ్ముడి ఆరుదైన కలయిక

0
1837

పూరి జగన్నాధ్ ,దివంగత సంగీత దర్శకుడు చక్రి ల కాంబినేషన్ గురుంచి చెప్పాల్సిన అవసరం లేదు . ఇట్లు శ్రావణి సుబ్రమన్యమ్ ,ఇడియట్ ,అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి ,శివమణి ,ఆంధ్రావాల ,143,దేశముదురు ,నేనింతే ,గోలీమార్ లాంటి హిట్స్ ఇచ్చారు . ఒకప్పుడు పూరి అంటే చక్రి ,చక్రి అంటే పూరి అంటూ ఉండేది .కాని సూపర్ సినిమాతో వాళ్ళ కాంబినేషన్ కి స్మాల్ బ్రేక్ పడి ,మళ్ళి కొన్ని సినిమాలు తీసారు. చక్రి ఇంటికి పూరి కుటిర్ అని పెట్టుకొని తన అభిమానాన్ని చాటాడు. పూరి కూడా చక్రి స్వంత తమ్ముడి లాగా చూసుకునేవాడు. కాని దురదృష్టవశాత్తు చక్రి అకాల మరణం చెందాడు.

కానీ పూరి తమ్ముడు హీరో సాయి శంకర్ ,చక్రి తమ్ముడు సంగీత దర్శకుడు మహిత్ నారాయణ ల కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది. అది నేనోరకం . ఇటివల విడుదల ఐన తీజర్ కి మంచి స్పందన వచ్చింది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది .తమ్ముల్లు కూడా అన్నల పేరు నిలబెట్టుకోవాలని కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here