ఇందూర్ ప్రతిష్ట పెంచుతున్న కలెక్టర్ యోగితారాణి

0
461

ఎప్పుడైతే నిజామాబాద్ జిల్లాకు యోగితా రాణి కలెక్టర్ ఛార్జ్ తీసుకున్నారో అప్పటి నుంచి జిల్లా అభివృద్ధికి టాప్ గేర్ పడింది. అంతే కాకుండా ఆమె చేసిన పనులకు ఫలితాలు దేశ స్థాయిలో మారుమోగుతున్నాయి. పాత నోట్ల రద్దు సమయంలో జిల్లా ప్రజలకు ,రైతులకు అవెర్నెస్ ప్రోగ్రాంలతో జిల్లాకు సమస్యలు రాకుండా కృషి చేశారు. నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ (NDLM), కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన డిజి ధన్ మేళ లో ఘనంగా నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు. ఇపుడు ప్రధాని మంత్రి గారి చేతితో అవార్డు అందుకున్నారు.

జాతీయ స్థాయిలో రైతు తన పంటను అమ్ముకునే వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ-నామ్(ఎలక్ట్రానిక్-జాతీయ వ్యవసాయ మార్కెట్) పద్దతి అమలులో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచింది. ఈ-నామ్ అమలులో అత్యుత్తమ సేవలకుగానూ నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు జాతీయ స్థాయి అవార్డు వరించింది.

నిజామాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ యోగితారాణా గారు ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్సీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవార్డు అందుకున్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గారు సివిల్ స‌ర్వీస్ డే సంద‌ర్భంగా ఈ అవార్డు యోగితా గారికి అంద‌జేశారు.దీనితో పాటు ప్రశంసాపత్రం, రూ.10 లక్షల నగదును అందజేశారు

ఈ-నామ్ అమ‌లులో మంచి ప‌నితీరుకు గాను అవార్డు వ‌రించింది. అనంత‌రం క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ… రైతుల‌కు, తెలంగాణ ప్ర‌భుత్వానికి అవార్డును అంకిత‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ-నామ్ అమలులో ఉన్న 225 మార్కెట్ల నుంచి 14 మార్కెట్లను స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసింది. వీటిల్లోంచి తుదిపోటీకి నిజామాబాద్, చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్, గుజరాత్‌లోని రాజ్‌కోట్ మార్కెట్‌ను ఎంపిక చేశాయి. చివరికి నిజామాబాద్ మార్కెట్‌ను విజేత నిలిచింద‌ని క‌లెక్ట‌ర్ వివ‌రించారు.

Author:Dasari Ashok,Tadpakal

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here