ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేసిన ముఖ్యమంత్రి

0
1140
yogi adithya nath shocking decision on reservations
yogi adithya nath shocking decision on reservations
    బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త కొత్త సంస్కరణలు చేపడుతుంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రైవేట్ కాలేజీలకు వెళ్లే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు రిజర్వేషన్లు ఎందుకంటూ, ప్రైవేట్ వైద్య కాలేజీలలో చదువుకుంటున్నారంటే వారు వెనకబడినవారు కాదని అలాంటివారికి రిజర్వేషన్లు ఎందుకంటూ ఆయన ప్రశ్నించారు. యూపీలోని అన్ని ప్రైవేట్ వైద్య కాలేజీల్లో రిజర్వేషన్లను తీసేసారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మాత్రం ఈ రిజర్వేషన్లు యధావిధిగా కొనసాగుతుందని వారికి ఎలాంటి లోటు లేదని తెలిపారు.

    ఇది ఇలా ఉండగా మరోవైపు ట్రిపుల్ తలాక్‌పై ఆయన మాట్లాడారు. ట్రిపుల్ తలాక్‌పై మౌనం వహించడదం ద్రౌపది మానభంగం వంటిదేనని అన్నారు. ట్రిపుల్ తలాక్ స్వస్తి పలకాలని, దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలని ఆయన కోరారు. దీనిపై ప్రజలు మౌనం వహించడాన్ని చూస్తే తనకు మహాభారతంలోని కథ గుర్తుకు వస్తుందని ఆయన అన్నారు. ఈ సమస్యపై ప్రధాని మోడీ ప్రస్తావిస్తూ ముస్లిం మహిళలకు తాము న్యాయం చేస్తామని చెప్పారు. ట్రిపుల్ తలాక్‌ను తాను వ్యతిరేకిస్తున్నట్లు సమాజం మేల్కొని బాధితులకు న్యాయం చేయడానికి ప్రయత్నించాలని మోడీ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here