అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కొనసమందర్ గ్రామంలోని మహిళా ప్రాంగణంలో నలుగురు
మహిళా రైతులు అలిసాల సత్తెమ్మ,బద్దం లక్ష్మీ, మక్కాల రాజు,మేకల లక్ష్మీ లకు సన్మానం చేయటం జరిగింది.ప్రతి మహిళ రైతుకు మహిళా దినోత్సవ మొమెంటో తో పాటు శాలువాలు కప్పి టీం సభ్యులు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు రవీందర్ ర్యాడ మాట్లాడుతూ ప్రపంచానికి అన్నం వండే మహిళా మణులు ఈ రోజు అదే చేత్తో వ్యవసాయం చేస్తూ ప్రపంచానికి అన్నం పండిస్తున్నారు.అలాంటి మహిళామణులకు సన్మనం జరపటం చరిత్రలో మొదటిసారిగా మా సంస్థ సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ కి దక్కడం మా అదృష్టం.రాబోయే రోజులలో సరికొత్త విధానాలతో మహిళలు వ్యవసాయం చేస్తే మంచి పుంతలు తొక్కుతుందని అభిప్రాయపడ్డారు.తెలంగాణ కో కన్వీనర్ నరేష్ దుంపల మాట్లాడుతూ మట్టి మనుషులైన మహిళ రైతులను సన్మానం చేయటం ఆనందంగా ఉందని చెప్పారు.సెర్ఫ్ క్లస్టర్ CC వర్ణం శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళ రైతులకు సన్మానం చేయటం మంచి ఆలోచన అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ మెంబెర్ కస్తూరి శ్రీకాంత్,సూర సంజీవ్ పాల్గొన్నారు.వీరితో పాటు సెర్ఫ్ VOA లు దుంపల లత,మేకల నయన,మల్లెల బాలమణి పాల్గొన్నారు.