అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో
మహిళా రైతు మీసాల మాధవి గారికి సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ అధ్యక్షుడు రవీందర్ ర్యాడ గారి చేత మహిళా దినోత్సవ మొమెంటో తో పాటు శాలువా కప్పి టీం సభ్యులు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ సంస్థ సభ్యులు ఆర్మూర్ శ్రీనివాస్,దాసరి శ్రీకాంత్, దాసరి రవి తేజ,దాసరి రవిందర్, భూమేష్,మీసాల గంగాధర్ మొదలగు వారు పాల్గొన్నారు.
రవిందర్ ర్యాడ మాట్లాడుతూ 14 ఏళ్ల క్రీతం మీసాల మాధవి గారి భర్త మీసాల రాజేశ్వర్ మరణించడంతో స్వంతంగా వ్యవసాయాన్ని చేస్తూ తన కుమారుడు మీసాల గంగాధర్ ని చదివిస్తూ కుటుంభ పోషణ చేస్తున్నందుకు ఈ గౌరవ సన్మానం చేస్తున్నామని,ఈ రైతమ్మను చూసి భవిష్యత్తులో ఎంతో మంది స్ఫూర్తి పొంది లాభసాటి వ్యవసాయాన్ని చేయాలని కోరారు.