కొడంగల్ గెలుపు గుర్రాలకు ఈ అంశాలు కలిసిరావాల్సిందే

1
504

రేవంత్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ లోకి వెళ్ళాడో అప్పటి నుంచి తెలంగాణ లో ఎన్నికల వేడి మొదలైంది అని చెప్పొచ్చు. అయన రాజీనామా స్పీకర్ ఫార్మాట్ లో చేసినా కూడా అది స్పీకర్ కి అందలేదు. కాని అది ఏ నిమిషంలో అయిన స్పీకర్ వద్దకు చేరి ఎన్నికల నగారా మొగవచ్చని విశ్లేషకుల అంచనా . దానికి తగ్గట్టు అన్ని పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎవరు గెలిస్తారు అని అందరి విశ్లేషణలు మొదలు అయ్యాయి. ఐతే ఈ సీట్ ని ఎవరు గెలవాలన్న కూడా కింది అంశాలు అనుకూలిస్తేనే ఉప ఎన్నిక గెలిచే అవకాశాలు ఉన్నాయని కబుర్లు టీం విశ్లేషించింది.1) కొడంగల్ గత ఎన్నికలను తీసుకుంటే ఇప్పటివరకు ఎవరు గెలిచినా కూడా 5-10 వేల ఓట్ల మెజారిటీ తోనే గెలవటం వల్ల ప్రతి ఒక్క వోట్ చాల ప్రతిష్టాత్మకమని తెలిసిపోతుంది కాబట్టి అక్కడ ఉన్న సామజిక వర్గాలు ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాయి అని తెలుస్తుంది.

2) కొడంగల్ లో ఇప్పటి వరకు 3 కుటుంబాల మద్యే నడిచిందని స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యే కాగా అయన రెండు సార్లు కొడంగల్ వెటరన్ లీడర్ గుర్నాథ్ రెడ్డి పైనే గెలిచాడు. గుర్నాథ్ రెడ్డి 1978 నుంచి గత ఎన్నికల వరకు 8 సార్లు పోటీలో ఉండగా దానిలో 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. తెరాస నాయకుడైన అయన ఈ సారి అయన కొడుకు ని రేవంత్ కి పోటీలో నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి గుర్నాథ్ రెడ్డి వర్గం ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే రేవంత్ రెడ్డి కి కష్ట కాలం మొదలైనట్లే ఎందుకు అంటే వరుసగా రెండు సార్లు రేవంత్ పైన ఓడిన గుర్నాథ్ రెడ్డి పైన ప్రజల్లో సానుభూతి ఉన్నట్లు సమాచారం.

3) కొడంగల్ లో నందారం కుటుంభం గురుంచి చెప్పాలి .కొడంగల్లో బలమైన ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన ఈ కుటుంబానికి నందారం వెంకటయ్య గారు 1972 లో ఇండిపెండెంట్ గా గెలిచి ,తర్వాత 1983 లో ఓడిపోయి తర్వాత 1994 ఎన్నికల్లో వెంకటయ్య గారు టిడిపి తరపున గెలిచారు. నందారం వెంకటయ్య హఠాన్మరణం తర్వాత ఆయన కుమారుడు నందారం సూర్యనారాయణ గారు తెదేపా ఎమ్మెల్యేగా అప్ ఎన్నికల్లో గెలిచారు. నందారం కుటుంబం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వారి మంచితనం, అవినీతి లేని పాలన కొడంగల్ ప్రజలను చాలా ఆకట్టుకుంది. అయితే ప్రమాదంలో నందారం సూర్యనారాయణ ఎమ్మెల్యే హోదాలో మరణించారు. దీంతో కోడంగల్లో ఈ కుటుంబానికి ప్రజలు మరింత దగ్గరయ్యారు. ఆ తరువాత నాయకత్వ లేమితో బాధపడిన తెదేపా కొడంగల్ సీటును రేవంత్ రెడ్డి చేతిలో పెట్టింది. నందారం సూర్యనారాయణ భార్య నందారం అనురాధ క్రియాశీలకంగానే ఉన్నారు. సూర్యనారాయణ సోదరుడు నందారం శ్రీనివాస్ కుమారుడు నందారం ప్రశాంత్ కోడంగల్ రాజకీయాలలో మరింత కీలకంగా మారిపోయారు. ఇపుడు ఈ కుటుంబాన్నిఒక వైపు తెరాస లోకి తీసుకురావటానికి ప్రయత్నాలు మొదలు అయ్యాయని చెబుతున్నారు,మరో వైపు తెదేపా కూడా వీళ్ళను బరిలోకి దించటానికి ప్రయత్నిస్తున్నాడని వినికిడి. నందారం వాళ్ళ మద్దతుంటే అటు సామాజికపరంగా ఇటు ఇతర ఓట్లను తమవైపు లాక్కోవచ్చని అంచనా.

4) కొడంగల్ లో మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ బీసీలు ఎక్కువ ప్రధానంగా ముదిరాజులు ,మున్నూరుకాపులు ,పద్మశాలి లు ఎక్కువ . ఇక్కడ బిసిలకు తెరాస టికెట్ ఇస్తే మాత్రం రేవంత్ రెడ్డి కి చుక్కెదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కేటీఆర్ యువసేన నాయకుడు గందె మోహన్ లాంటి బిసి నాయకులు టికెట్ కోసం ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

https://www.facebook.com/TelanganaKaburlu/

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here