అజ్ఞాతంలో ఉన్నతెలంగాణ టాలెంట్ ని విరాటపర్వం పూర్తిగా బయటకు తీస్తుందా ?

0
147

ఒకప్పుడు తెలుగు సినిమా అంటే తెలంగాణ సంసృతికి తెలంగాణ యాసకు తెలంగాణ టాలెంట్ కి ఎక్కువ ప్రాధాన్యం ఉండేది కాదు. తెలంగాణ మట్టిలో పైడి జయరాజ్ లాంటి సూపర్ స్టార్ పుట్టినా కూడా అయన హిందీలోకి వెళ్లటంతో అయన తెలంగాణ నటుడు అనే విషయం చాలా మందికి తెలియదు. ఎన్కౌంటర్ శంకర్ ,మ్యూజిక్ డైరెక్టర్ చక్రి ,చంద్ర బోస్ లాంటి వాళ్ళు తర్వాత సురేందర్ రెడ్డి,సంపత్ నంది, తరుణ్ భాస్కర్,సందీప్ వంగ ,విజయదేవరకొండ,విశ్వసేన్ లాంటి వల్ల చలవతో తెలంగాణ లో కూడా తెలుగు సినిమాలో ఒక భాగమే అని ప్రతి తెలంగాణ ప్రేక్షకుడు కాలర్ ఎగరేసే విదంగా చేశారనేది వాస్తవం. కుబుసం శ్రీనాధ్,సానా యాదిరెడ్డి లాంటి టాలెంటెడ్ దర్శకులు తమ తమ పంథాలో సినిమాలు తీసినా కూడా స్టార్ ఇమేజ్ రాలేదు.

కాని నిన్న తెలంగాణ దర్శకుడు నీది నాది ఒకే కథ ఫెమ్ వేణు ఉడుగుల రెండవ సినిమా వీరాటపర్వం మొదలవగానే సినిమా సర్కిల్ లో అందరి దృష్టి వేణు మీద పడింది. దానిక్కారణం టైటిల్,దాని టాగ్ లైన్ అయితే రెండవ కారణం రానా దగ్గుబాటి హీరో ,సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్. ప్రధానంగా బాహుబలి తర్వాత జాతీయంగా అభిమానులని మార్కెట్ ని సంపాదించుకున్న రానా హీరోగా నటించటం అంటే వేణు కి కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. నీది నాది ఒకే కథ సినిమాకు సరైన బడ్జెట్,మార్కెటింగ్ ,సరైన ఫోటోగ్రఫీ లేకుండానే కేవలం కంటెంట్ తో సినిమా తీసాడు వేణు. ఇపుడు పెద్ద కాన్వాస్ తో మంచి బ్యానర్ తో తీస్తున్నాడు కాబట్టి ఆయనకు రానున్నవి మంచి రోజులు అని ఫిల్మ్ సర్కిల్ లో చెబుతున్నారు.

ఇప్పటి వరకు అజ్ఞాతవాసంలో ఉన్న తెలంగాణ టాలెంట్ విరాటపర్వం తో స్వర్ణయుగం రావాలని కోరుకుందాం.

Author: Puli Ashok Goud

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here