తెలంగాణ విఠల్.. ఈ పేరు చెబితే ఉద్యమ సమయంలో ప్రతి ఉద్యమకారుడు నోటా వచ్చే ఒకే మాట, అజాత శత్రువు.నోరు తెరిచి ఏదీ అడిగాడు,ఇచ్చిన పని కోసం శక్తులన్ని పెడతాడు. అత్యంత విశ్వసపాత్రుడు, మంచితనం,అపారమైన తెలివి,మంచి అడ్మినిస్ట్రేటర్,చెత్త రాజకీయాలకు దూరంగా ఉంటాడు.అంతే కాకుండా పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన తెలంగాణ ఉద్యమ బిల్లును డ్రాఫ్ట్ చేయటంలో కీలకపాత్ర.ఇవన్నీ ఉన్నా కూడా ఈయనకు అదృష్టం ఆమడ దూరంలో ఉంటుందని చెప్పొచ్చు.
గతంలో ఉద్యమంలో ఉద్యోగులను ,ఉద్యోగ సంఘాలను ఒక్కతాటి మీదకు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించినా కూడా ఆయనకు రావాల్సిన స్థానం రాలేదు అని చెప్పాలి.చట్టసభలకు వెళ్లాల్సిన ఆయన్ని కొన్ని శక్తులు అప్పట్లో టికెట్ రాకుండా అడ్డుకున్నారని జగమెరిగిన సత్యం.తరువాత టీఎస్పీఎస్సి డైరెక్టర్ లాంటి పదవి తో సరిపెట్టుకున్నాడు.
ఈసారి అయిన చైర్మన్ పదవి వస్తుందని ఉద్యోగ సంఘాలు,బీసీ సంఘాలు భావించాయి కానీ ఈసారి కూడా ఆయనకు చుక్కెదురు అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఈసారి కరీంనగర్ కి చెందిన రిటైర్డ్ ఐపీఎస్ నవీన్ చంద్ కి ఆ పదవి రానుంది అనే సమాచారం బయటకు వచ్చింది.నవీన్ చంద్ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీ కాంతారావు గారికి అల్లుడు అని తెలిసింది.ఈ వార్తలో ఎంత నిజముందో కాని నిజమైతే ఒక మంచి ఉద్యమకారుడికి అవమానం జరిగినట్లే.