అమితాబ్ రైతులకు సహాయం చేశాడు… మన మహేష్ బాబు ఎప్పుడు చేస్తాడో?

0
175

ఇటీవల మహేష్ బాబు రైతుల కథాంశంతో తీసిన మహర్షి సినిమాలో వ్యవసాయం యొక్క ప్రాధాన్యతను ,పాఠశాలల్లో వ్యవసాయ శాస్త్రాన్ని పెట్టాలని,వారాంతపు వ్యవసాయం చేయాలని చాలా సందేశాలులు ఇచ్చాడు. ఆ సినిమాల్లో ప్రపంచంలో నెంబర్ 1 కంపెనీ కి సీఈఓ గా పనిచేస్తూ 90% ఆదాయాన్ని వ్యవసాయానికి విరాళంగా ఇస్తాడు. శ్రీమంతుడు సినిమాలో ఊరును దత్తత తీసుకున్న మహేష్ నిజజీవితంలో కూడా తమ స్వంత ఊరును దత్తత తీసుకొని శబాష్ అనిపించాడు. అదే విదంగా నిజజీవితంలో తెలుగు రాష్ట్రంలో ఉన్న రైతులకు సహాయం చేస్తాడు అని అందరూ భావించారు. కాని సినిమా విడుదలై నెల రోజులు అయి బ్రహ్మాండమైన వసూళ్లు చేసినా కూడా మహేష్ బాబు నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కాని తెలుగు సూపర్ స్టార్ చేయని పని ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ ఆ పని చేసి అందరికి ఆదర్శం అయ్యాడు.

వివరాల్లోకి వెళితే బాలీవుడ్‌ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌ ఎప్పటిలాగే మరోసారి రైతన్నలకు సహాయం చేశాడు. అప్పులు తీసుకుని తీర్చలేని స్థితిలో ఉన్న బిహార్‌కు చెందిన దాదాపు 2100 రైతుల అప్పులను బిగ్‌బి తీర్చారు. ఈ విషయాన్ని ఆయన తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ‘నేను ముందుగా వాగ్దానం చేసినట్లుగానే బిహార్‌కు చెందిన 2100 రైతులను ఎంపికచేసి వారి అప్పులను తీర్చేశాను. కొందరి అప్పులను నేరుగా బ్యాంకుల్లోనే వేసేశాను. మరికొందరిని నా నివాసానికి పిలిపించి అభిషేక్‌, శ్వేత చేత చెక్కులు అందించాను’ అని పేర్కొన్నారు. గతంలోనూ ఇలా అప్పులబారిన పడిన ఎందరో రైతులను అమితాబ్‌ ఆదుకున్నారు. గతేడాది ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వెయ్యి మంది రైతులకు దాదాపు రూ.5.5 కోట్లతో రుణమాఫీకి సాయం చేశారు.

ఇప్పటికైనా తెలుగు సూపర్ స్టార్ మహేష్ ,ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ ని అనుసరించి సినిమాలో సందేశం ఇచ్చిన విదంగా తెలుగు రైతులను ఆదుకోవాలని కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here