ఈ ఫోటో ఆ హీరోదేనా?

0
451

మాములుగా పవన్ కు తన అన్నయ్య చిరంజీవి అంటే చాల ప్రేమ ఉందని అందరికి తెలుసు ,ఒకప్పుడు చిరు మీద ఈగ వాలిన ఊరుకునేవాడు కాదు ,ముఖ్యంగా చిరంజీవికి పద్మబూషణ్ బిరుదు వస్తే సినిమా పరిశ్రమ మొత్తం కలిసి ఆయనకు ఘనంగా సత్కరించింది ,అపుడు మా అద్యక్షుడైన మోహన్ బాబు చిరు మీద వంగ్యస్త్రాలు ప్రయోగించాడు. దానికి బదులు గా తమ్ముడు మోహన్ బాబు అని సంబోదించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రజా రాజ్యం పెట్టిన తర్వాత చాల సార్లు ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్తులపైన విరుచుకుపడ్డాడు.

కాలం గిర్రున తిరిగింది ,పార్టీ ని కాంగ్రెస్ లో కలపటం ,పవన్ తన వృత్తిలో బిజి అయ్యి అగ్ర స్తానానికి వెళ్ళటం ,మళ్ళి జన సేన పార్టీ పెట్టి బాజాపా,తెదేపా కి మద్దతు ఇచ్చి ఆ పార్టీ లను అధికారంలోకి తేవటం జరిగిపోయింది. ఈ క్రమంలో చిరు ,పవన్ ఇద్దరు రాజకీయాల్లో భిన్న ద్రువలుగా మారిపోయారు. ఈ సమయంలో చిరు పైన ఉన్న ప్రేమ ని రాజకీయ కారణాల వలన బయట ప్రదర్శించలేదు. ఈ దశలో ఎంతో మంది చిరు పైన విమర్శలు చేసిన కూడా సైలెంట్ గా ఉన్నాడు పవన్. ఎందుకంటే రాజకీయాల్లో విమర్శలు మామూలే అనే విషయాన్నీ ఒంటపట్టుకున్న పవన్ వాటిని తేలిగ్గా తీసుకున్నాడు. కాని ఇటివల ఒక నటుడు చిరు గురుంచి హేళనగా మాట్లాడటం పవన్ ని బాగా హర్ట్ చేసిందట. ఆ విమర్శలు రాజకీయ స్థాయి ని దాటి వ్యక్తిగతంగా చేసినట్లు అనిపించిందట. దానికి కచ్చితంగా బదులు సర్దార్ ఆడియో ఫంక్షన్ లో బదులు ఇస్తాడని పలు వార్తలు కూడా వచ్చాయి. పవన్ కూడా కచితంగా బుద్ది చెప్పాలని అనుకున్నాడట. ఐతే ఆ సదరు నటుడు పైన డైరెక్ట్ గా విమర్శిస్తే తన స్తాయి ని తగ్గిపోతుందని భావించి ,దానికి ఒక పథకం వేసాడని తెలుస్తుంది. పరోక్షంగా ప్రస్తావించి తిప్పికొట్టాలని భావించి గతంలో చిరు ఆ నటుడి విషయంలో ఎలా ప్రవర్తించాడని ఒక సంఘటనని గుర్తు చేసాడని మీడియాలో అనుకుంటున్నారు.

దాని ప్రకారం ఓ రోజు షూటింగ్ లో ఒక నటుడి ఫోటో వున్న ఒక వార పత్రిక క్రింద పడితే అందరూ ఆ ఫోటోని తొక్కుకుంటూ పోతున్నారు గానీ దాన్ని తీసి పైన పెట్టలేదట.అది గమనించిన చిరంజీవి సాటి నటుడి ఫోటోని తొక్కడం భాధనిపించి వెంటనే దాన్ని తీసి,దుమ్ముని తుడిచి ప్రక్కన పెట్టాడట. ఆ ఫోటోలో నటుడు ,తన టార్గెట్ చేయాల్సిన నటుడు ఒకరే అని అంటున్నారు అయన అభిమానులు. దీనిలో నిజం కూడా లేకపోలేదు. మాములుగా పవన్ కళ్యాణ్ ఎవరి జోలికి పోడు ,ఎవరి గౌరవాన్ని తగ్గించాడు ,ఎలాంటి కారణం లేకుండా ఆ సహా నటుడి గురుంచి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కాని అయన స్పీచ్ లో ఈ సంగటన ని హైలైట్ చేస్తూ మాట్లాడేసరికి ఆయనని టార్గెట్ చేయటానికి సర్దార్ ఫంక్షన్ వేదిక గా నిలిచిందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here