ఆర్థిక మాంద్యానికి నల్ల ధనానికి లింక్ ఏంటి?

0
59

ఆర్థిక మాంధ్యం, Automation ల దెబ్బకు దేశ ఆర్థికపరిస్థితి కుదేలుకానుందా?


దేశంలో ఆర్థికమాంధ్యం తీవ్రతరం కాబోతోంది. గతంలో చాలామంది వద్ద అన్ అకౌంటబుల్ మనీగానీ, బ్లాక్మనీ గానీ ఉండడం వల్ల ఆర్థిక మాంధ్యంలో ఆ సొమ్మును కలిగి ఉన్నవారు, వ్యాపారులు, వడ్డీలకో లేక పెట్టుబడి రూపంలోనో బయటకు తీయడంతో చాలావరకూ దేశానికి మంచే జరిగిందని చెప్పవచ్చు.

అయితే నోట్లరద్దు,GST విధానాలతో బాటు బ్యాంకు ట్రాన్సాక్షన్లపై తీవ్ర ఆంక్షల వల్ల ప్రజలవద్ద, వ్యాపారులు డబ్బు బయటకు తీయలేని పరిస్థితి నెలకొంది.

ఇప్పటికే Infosys 10 వేలమందిని, Congnigent Technologies 7 వేలమంది ఉద్యోగులనూ తొలగించాయి. చాలా MNC లు ఇంకా వేలాదిమంది ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి, తీసేయబోతున్నాయి.

రాబోయేరోజుల్లో Automation వల్ల Man Power అవసరం తగ్గిపోతుండడంతో లక్షల IT ఉద్యోగులు తమ జీవనోపాధిని కోల్పొనున్నారు.

రానున్న రోజులు దేశానికి తీవ్రమైన గడ్డు రోజులు రానున్నాయి.

మోడీ,షాలు ఏవిధంగా ఈ విపత్కర పరిస్థితులని నెట్టుకొస్తారో చూడాలి.

వ్యాసకర్త : అశ్విన్ పోతుల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here