రూపంలో కాలకేయులు … వ్యక్తిత్వంలో బాహుబలిలు

0
458

ఇదేదో రాజమౌళి సినిమా అనుకోకండి ,ఒకపుడు ప్రపంచ క్రికెట్ ని శాసించి ,తర్వాత తన కళని కోల్పోయి ,మునిగిపోతున్న నావకి రిపేర్ చేసి మల్లి రేస్ లో ముందు నిలిచి ,పొట్టి క్రికెట్ లో ఛాంపియన్ గా నిలిచినా కరేబియన్ దీవుల్లో ఉన్న ఎన్నో దేశాల,దీవుల సముహారం వెస్టిండిస్ క్రికెట్ జట్టు. పాకిస్తాన్ లాంటి ఒక్క దేశంలో క్రికెట్ ఆడటానికి ఎన్ని రాజకీయాలు ఉంటాయో అందరికి తెలుసు. ఒక టోర్నమెంట్ కి ఆడిన జట్టు తర్వాత టోర్నీ కి ఆడదు ,అంతెందుకు ఒక టోర్నమెంట్ లో మంచి ఫాం తో జట్టుకి సారద్యం వహించి విజయాలు అందించిన కూడా వచ్చే టోర్నమెంట్ లో స్థానం ఉంటుందని గారంటీ లేదు. ఆ రేంజ్ లో ఉంటాయి పాలిటిక్స్ ,ఒక దేశం లో ఉన్న అందరి నాయకులను ,క్రికెటర్లను ,అధికారులను ,ప్రేక్షకులను ఒక్క తాటికి తేవటం అంత ఈజీ గా కాదు … అలాంటిది చాల దేశాలు కలిపి ఒక టీం గా ఏర్పడి విజయాలు సాదిస్తూ ,రాజకీయాల పరంగా ఎన్నో సమస్యలు ఉన్న కూడా క్రికెట్ వరకు మాత్రం భిన్నత్వంలో ఏకత్వం చూపిస్తున్నారు. రాజమౌళి సినిమాలో కాలకేయుల లాగా రూపం తో ఉన్నా వీళ్ళ ఆటలో ,వ్యక్తిత్వంలో మాత్రం బాహుబలి లు కనిపిస్తారు .

1890 లో మొదలైన ఈ జట్టు ,ఇంగ్లాండ్ ,ఆసిస్ జట్టులకు దీటుగా ఆడింది . 1950 వచ్చేసరికి విండిస్ జట్టు మాత్రం ప్రపంచ క్రికెట్ చుక్కలు చూపించింది. ముఖ్యంగా 1970 -1983 వరకు ఐతే అటు టెస్ట్ క్రికెట్ ,వన్ డే క్రికెట్ లో ఎకచాక్రదిపత్యం సాగించింది .వీవ్ రిచర్డ్స్ ,గారి సోబర్స్ ,క్లైవ్ లాయిడ్ ,అంబ్రోస్ ,వాల్ష్ తర్వాత లారా వంటి అత్త్యుత్తమ క్రికెటర్ లను అందించింది. ఈ ముహూర్తాన భారత జట్టు 1983 లో చెక్ పెట్టిందో కాని అప్పటి నుంచి వెస్ట్ ఇండీస్ క్రికెట్ కిందకు జారటం మొదలైంది 2000 తర్వాత గేల్ లాంటి ఆటగాడు వచ్చినా … 2012 లో టీ 20 ఛాంపియన్స్ అయిన కూడా వెస్ట్ ఇండీస్ జట్టులో లుకలుకలు మొదలు అయ్యాయి. ఆటగాళ్ళు వెర్సెస్ మేనేజ్మెంట్ రాజకీయాలతో ఇక జట్టు పని అయిపోయిందని భావించారు. ఒక దశలో టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్ళిపోతుందని అనుకున్నారు. ఇలాంటి దశలో అందరి అంచనాలు తలకిందులు చేస్తూ 70 వ దశకం లోని వెస్టిండిస్ విన్యాసాలను ఈ తరానికి చూపించారు. ఒక చిన్న జట్టు ఆఫ్గనిస్తాన్ తో ఓడినా కూడా గేల్ లాంటి ఆటగాడు ఆ జట్టు ఆటగాళ్ళతో దాన్స్ చేయటం చూస్తె వాళ్ళ క్రీడాస్పూర్తి ఏంటో తెలుసోకోవచ్చు . ఏది ఏమైనా మసకబారిపోతున్న క్రికెట్ కి వెస్ట్ ఇండీస్ ప్రాణం పోసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here