రానున్న ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం…

0
256
weather report: next 5days rain
weather report: next 5days rain

రేపటి నుంచి  రానున్న ఐదు రోజులపాటు  భారీ నుంచి  అతి భారీ వర్షాలు  కురిసే అవకాశం  ఉందని స్పష్టం  చేసింది వాతావరణశాఖ. బంగాళాఖాతంలో  ఏర్పడిన  ఉపరితల  ఆవర్తన ద్రోణి  అల్పపీడనంగా  మారింది. దీని ప్రభావంతో పాటు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్రంమొత్తంలో వర్షాలు పడుతున్నాయి. గత కొద్ది రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి బేసిన్ లో ఉన్న చెరువులకు జలకళ వచ్చింది. దాదాపు ఏడు వేల చెరువులు నిండుకుండల్లా మారాయి. రెండువేలకు పైగా చెరువులు మత్తడి దుంకుతున్నాయి. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎక్కువ చెరువులు అలుగు పోస్తున్నాయి.

జయశంకర్ భూపాలపల్లి, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here