పవన్ అకౌంట్ పై వాన్నాక్రై హాకర్స్ దాడి

0
650
Wanna cry hackers attacks on pawan kalyan twitter account
Wanna cry hackers attacks on pawan kalyan twitter account
    ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాలాన్ని గడ గడలాడిస్తున్నవాన్నాక్రై వైరస్ ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ట్విట్టర్ అకౌంట్ పై దాడి చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక అభిమానులను కలిగిన పవన్ కల్యాణ్ ఇటీవల జరిగిన ధర్న చౌక్ సంఘటన పై స్పందించడానికి తన ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయగా పాస్ వర్డ్ చేంజ్ చేసినట్టుగా మెస్సెజ్ రావడంతో ఆయన కూడ ఈ వైరస్ భారీన పడినట్లు పవన్ కల్యాణ్ సన్నిహితులు తెలియజేసారు.

    ట్వీట్టర్ అకౌంట్ ప్రారంభించిన కొద్ది సేపట్లోనే అత్యధిక ఫాలోవర్స్ ని పొందిన రికార్డ్ పవన్ కల్యాణ్ పేరు మీదనే ఉండటం విశేషం. ప్రస్తుతం పవన్ కల్యాణ్ని దాదాపు 18 లక్షల మంది ఫాలో అవుతున్నారు.

    ఈ వైరస్ ఇప్పుడు భారత దేశంలోని అన్ని కార్యకలాపాలకి విఘాతం కలిగిస్తూ ప్రజలకి ఇబ్బందిని కలిగిస్తుంది. టిటీడీ కార్యకలాపాలకి కూడ ఈ వైరస్ ప్రభావం ఉందని తెలిసింది. టిటీడీ కార్యాలయంలోని 20 కంప్యూటర్లు ఈవైరస్ భారిన పడినట్లు సమాచారం. కానీ భక్తులకి సంభందించిన కార్యక్రమాలకి ఎలాంటి విఘాతం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటునట్లు టిటీడి అధికారులు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here