122 డివిజన్ వివేకానందనగర్ లోని పలు సమస్యలపై జోనల్ కమీషనర్ మమత ని కలిసి డివిజన్ అభివృద్ధికి ఫండ్స్ రిలీస్ చేసి దాని ద్వార డివిజన్ అభివృద్ధి చేయవలసిందిగా కోరుతూ వినతీ పత్రం అందజేసిన కార్పొరేటర్ శ్రీమతి యం లక్ష్మీబాయి గారు మరియు శ్రీ మాధవరం రామారావు గారు. అలాగే నిదులు మంజూరు చేసి సి.సి రోడ్లు పనులు కాంట్రాక్టర్ల తో త్వరగా పని మొదలు పెట్టాలని అలాగే డివిజన్ లోని పలు సమస్యల వల్ల అక్కడ చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు చాల ఇబ్బంది పడుతున్నారు మీరు ఒకసారి వచ్చి పర్యటించవల్సిందిగా కోరారు.
జోనల్ కమీషనర్ గారు సానుకూలంగా స్పందించి అబివృద్దిపనులు వారం లో మంజూరు చేస్తాననీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో డివిజన్ వార్డ్ కమిటీ సభ్యులు వెంకటస్వామి సాగర్ మరియు యూత్ వింగ్ సూర్య ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
