తెలంగాణ రాష్ట్రం ఒక ఆణిముత్యాన్ని కోల్పోయింది.

0
413
Viidya sagar rao gaaru is no more
Viidya sagar rao gaaru is no more
    తెలంగాణ రాష్ట్రం ఒక ఆణిముత్యాన్ని కొల్పోయింది. తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న నీటి దోపిడి గురించి దేశమంతా తెలిసేలా గళం విప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల శాఖ సలహాదారు విద్యాసాగర్ రావు గారు మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి నీటిపారుల రంగానికి అవసరమైన సలహాలు సూచనలు అందించేందుకు అడ్వయిజర్ గా పని చేస్తున్న ఆయన ఈ రోజు ఉదయం 11 గంటల 23 నిమిషాలకి హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రిలో ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ తుది శ్వాస విడిచినట్లు తెలిపారు.
    1939 నవంబర్ 14న ఉమ్మడి నల్లగొండ జిల్లా జాజిరెడ్డిగూడెం(ప్రస్తుతం యాదాద్రి ) లో విద్యాసాగర్ రావు గారు జన్మించారు.
    1960లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీటెక్ పూర్తి చేసిన ఆయన, 1979లో రూర్కీ యూనివర్సిటీ నుంచి వాటర్ రీసోర్స్ డవలప్ మెంట్ లో మాస్టర్ డిగ్రీ చేశారు.సెంట్రల్ వాటర్ కమిషన్ ల చీఫ్ ఇంజినీరీ గా సేవలు అందించిన ఆయన, చాలా కాలంగా ఊపిరి తిత్తుల వ్యాధితో భాద పడుతూ ఈ రోజు స్వర్గస్తులయ్యారు.
    విద్యాసాగర్ గారి మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి దిగ్ర్బాంతి వ్యక్తం చేసారు. ఆయన రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను జరపాలని ఆదేశాలు జారి చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here