మిషన్ భాగిరథ ఉప సారథిగా వేముల ప్రశాంత్ రెడ్డి

0
578

ఇందూర్ వాకిట్లో మరొక కాబినెట్ పదవి వచ్చింది . ఇప్పటికే డి. శ్రీనివాస్ ,పోచారం లు కేబినేట్ హోదాలో ఉన్నారు ఇపుడు బాలకొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కి పదవి వచ్చింది. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సైప్లె కార్పొరేషన్ (మిషన్ భగీరథ) వైస్ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి నియమితులయ్యారు. దీనికి సంబంధించి తెరాస ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ ర్యాంకులో ఈ పదవిలో ఆయన మూడు ఏళ్ల పటు ఉంటారు ప్రతి ఇంటికి మంచినీటిని అందించాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్నిప్రారంబించిన సంగతి తెలిసిందే. ఈ వార్త తో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు

స్వతహ గా సివిల్ ఇంజనీర్ అయిన వేముల ప్రశాంత్‌రెడ్డి, గోదావరి పుష్కరాలకు ,చండియాగం యొక్క పనులు .దగ్గరుండి నడపడంతో కెసిఆర్ కి బాగా దగ్గరయ్యాడు . ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి వాళ్ళ తండ్రి వేముల సురేందర్ రెడ్డి తెరాస లో సీనియర్ నాయకుడు ,మాజీ నిజాం సుగర్స్ సంగం అద్యక్షుడు. గా ఎన్టీఆర్ హయంలో పనిచేసాడు. ఇపుడు వేముల ప్రశాంత్‌రెడ్డి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here