వాజపేయి,పివి లను కూడా వదలని వర్మ

0
530

చూస్తుంటే రామ్ గోపాల్ వర్మ ఎవరిని వదిలేలా కనిపించటం లేదు. సినిమా నుంచి టీవీ సీరియల్ వరకు,సంపూర్ణేష్ బాబు నుంచి పవన్ కళ్యాణ్ వరకు ,సామాన్య ప్రజల నుంచి ప్రధాన మంత్రి వరకు . అవకాశం దొరికితే తన హుమెరిజం తో ట్విట్టర్లో కుమ్మేస్తాడు. కానీ ఈసారి దేశంలో గొప్ప ప్రధానులుగా అభివర్ణించే వాజపేయి ,పీవీ నరసింహ్మ రావు తో పాటు 8 నెలల ప్రధానిగా ఉన్న చంద్ర శేఖర్ ల పైన పంచ్ వేసాడు. అది కూడా కాంగ్రెస్ అధినేత్రి ఫోటో పైన .

అసలు విషయానికొస్తే 90 వ దశకంలోని ఒక మీటింగ్ ఫొటోలో ముందు వరుసలో సోనియా గాంధీ సీరియస్ గా కూర్చుంటే వెనకాల వాజపేయి,పీవీ ,చంద్రశేఖర్ లు కూర్చుని నవ్వుతుంటారు. నిజానికి సోనియా కి మాజీ ప్రధానుల నవ్వుకి సంబంధం లేదు. కానీ వర్మ మాత్రం తన మార్క్ వెటకారాన్ని జోడిస్తూ ఈ ఫోటోలో ముగ్గురు భారతీయులు ఒక డీసెంట్ మహిళపై కుళ్ళు జోకులు వేస్తూ ఆమెను అగౌరవపరుస్తున్నారని వాళ్ళు ఎవరో ఇన్వెస్టిగేట్ చేయాలనీ పోలీసులను కోరాడు. నిజానికి వాజపేయి ,పీవీ లపైనా ఎవరు కూడా జోకులు వేయరు.కానీ వర్మ వాళ్ళను కూడా వదల్లేదు. వాట్ ఈజ్ దిస్ వర్మ సర్ …..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here