ట్విట్టర్ లో వర్మకి సిల్వర్ పంచ్

0
1511

రామ్ గోపాల్ వర్మ వలన తెలుగు ప్రజలకు ట్విట్టర్ చాల దగ్గరైంది ,ఎందుకంటే ఆయన వేసే పంచులు ,విశ్లేషణలు ట్విట్టర్ తెలుగు యూజర్స్ కి మంచి కాలక్షేపం. ఎందుకంటే మెగా ఫామిలీ మీద పంచులు వేస్తె మహేష్ అభిమానులకి,నందమూరి అభిమానులకు ఆ రోజుకి వాళ్ళకి దేవుడు. ప్రిన్స్ మీద సెటైర్ వేస్తె పవన్ ఫాన్స్ ,తారక్ ఫాన్స్ పండగ చేసుకుంటారు. తారక్ మీద వేస్తె మెగా అభిమానులు,మహేష్ అభిమానులు పండగ చేసుకుంటారు. ఒక్కోసారి బాలయ్య ఫాన్స్ ని తారక్ ఫాన్స్ కి మంట పెడతాడు. అయన ట్విట్లలో ఎవరికో ఒకరి ఇష్టంగా ఉండేవిగా ఉంటాయి కాబట్టి ఇప్పటి వరకు ప్రాబ్లెమ్ రాలేదు. కానీ ఈ మధ్య భారతీయలంత సంతోషపడే సంఘటనలో దాదాపు అందరి మనోభావాలకు వ్యతిరేకంగా ట్విట్ చేసాడు. అదే సింధు,సాక్షి లకు భారీ నజరానా లు ఇవ్వటం గురుంచి . ఒక సిల్వర్ మెడల్ వస్తేనే ఇన్ని నజరాలు ఇస్తే అమెరికాకి 67 మెడల్ వస్తే వాళ్ళు ఎంతివ్వాలి అని just asking …. అని ఒక టాగ్ పెట్టాడు.

కానీ దీనికి ఒక అభిమాని మంచి పంచ్ ఇచ్చాడు,ఆయన ప్రకారం “సార్ మీరు ఒక్క శివ సినిమా హిట్ తో గొప్ప వాళ్ళు అయ్యారు ,మరి శంకర్,రాజమౌళి ,బాలా లాంటి గొప్ప సినిమాలిచ్చిన వాళ్లకు ఎంత పేరు రావాలి just asking …అని సమాధానం ఇచ్చాడు. పంచ్ అదిరింది కదా . సింధు లాంటి వాళ్లకు నజరానా లిస్తే భవిష్యత్తులో చాలా మంది క్రీడల వైపు ఆకర్షించే ఛాన్స్ ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here