నేను మోసపోయా…

0
329
vaanisri fraud by relatives
vaanisri fraud by relatives
    తెలుగు సినిమా ఇండస్ట్రీ సహజ నటుల్లో వాణిశ్రీ ఒకరు.. వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి. వాణిశ్రీ తెలుగు సినిమాలతో పాటు దక్షిణాది తమిళ , కన్నడ మరియు మలయాళ సినిమాలలో కూడా నటించింది. వాణిశ్రీ మరపురాని కథ సినిమాతో చిత్రరంగ ప్రవేశము చేసిన సుఖదుఃఖాలు సినిమాలో చెల్లెలి పాత్రతో మంచి పేరుతెచ్చుకున్నది. ఆ తరువాత కథానాయకిగా అనేక సినిమాలో నటించిన వాణిశ్రీ 1970వ దశకమంతా తెలుగు సినీ రంగములో అగ్రతారగా నిలచింది.
    ఐతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తాను తెలిసిన వారి దగ్గరే మోసపొయానని వాపోయింది.
    తన అక్క-బావలే తన ఆస్తి విషయంలో చాలా మోసగించారని చెప్పింది. ఆమె సిని ఇండస్ట్రీలో బిజిగా ఉన్నప్పుడు తన ఆస్తిపాస్తులని చక్కదిద్దే పనిని వాళ్ళకి అప్పగించింది అంటా. అదే అదునుగా వాళ్ళు ఆమె ఆస్తిని కాజేయాలని చూశారట! ఈ విషయంలో తను కోర్టు చుట్టు తిరిగారంటా. తరువాత తన ఆస్తిని వాళ్ళు ఇచ్చేసారని, తన వాళ్ళే అమెని మోసం చేయడం భాదగా ఉందని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here