స్వచ్చ రాజకీయాలకు ఎన్.ఆర్.ఐ లు ముందుకు రావాలి – వి.ప్రకాశ్

0
827

వాషింగ్టన్ రాష్ట్రం లోని సియాటెల్ నగరం లో వి. ప్రకాశ్ రచించిన “దా హిస్టరి ఆఫ్ తెలంగాణ మూవ్ మెంట్స్” అనే పుస్తకం విడుదల ఘనంగా జరిగింది. వాటా, వాట్ జి మరియు ఎన్.ఆర్.ఐ టి.ఆర్.ఎస్  (సియాటెల్) ఆద్వర్యం లో జరిగిన ఈ పుస్తక విడుదల కార్యక్రమం లో పలువురు ఎన్.ఆర్.ఐ లు సంతొషంగా పాల్గొని రచయిత వి.ప్రకాశ్ ను ఘనంగా సన్మానించి, తెలంగాణ చరిత్రను వెలుగు లోకి తెచ్చినందుకు క్రుతజ్ఞతలు తెలిపారు. ముఖ్య అథిదులుగా కోదాడ నుండి వచ్చిన జలగం రంగారావు గారు, వెణు గోపాల్ గారు, టీటా అద్యక్షుడు సందీప్ మక్తాల గారు హజరు అయ్యారు. ఈ సందర్భంగా వి.ప్రకాష్ మాట్లడుతు ఘంట చక్రపాణి, కే.సి.ఆర్ ల సూచనతో ఈ పుస్తకం రాయటం జరిగింది అని, 1800 వ సంవత్సరం నుండి నేటి వరకు జరిగిన అనేక సంఘటనలను వెలుగు లో తీసుకు రావటం లో తను ఎన్ని కష్టాలు పడింది వివరించారు. ఈ పుస్తకం తెలుగు వర్షన్ సుమారు 50,000 కాపిలు అమ్ముడు పొయి రికార్డ్ చేసుకుంది. ఎన్.ఆర్.ఐ టి.ఆర్.ఎస్ తరపున పాల్గొన్న సుధీర్ జలగం అవినీతి నిర్మూలన పై అడిగిన ప్రశ్న కు సమాదానంగా కే.సి.ఆర్ పాలనలొ కొంతవరకు లంచగొండి తనం తగ్గటం తను ప్రత్యక్షంగా చూసానని, పూర్తి స్తాయిలో అవినీతి నిర్మూలన జరగాలంటే తెలంగాణ లోని మేధావులతో పాటు, ఎన్.ఆర్.ఐ లు రాజకీయల్లోకి వచ్చి గ్రామ స్తాయి పదవులనుండి రాష్ట్ర స్తాయి పదవులకు వన్నె తేవాలని పిలుపునిచ్చారు.నవీన్ వోరుగంటి ఫ్లొరొసిస్ మీద, సాయి రెడ్డి ద్వితియ శ్రేణి పట్టణాల అభివ్రుద్ది మీద, దినెష్  హైకోర్ట్  మీద అడిగిన ప్రశ్న లకు కూడ ఓపికతో సమాధానం ఇచ్చారు. స్తానిక ప్రముఖుడు  మహిధర్ రెడ్డి గట్టిగా కోరటం తోనే సియటెల్ కి రావటం జరిగిందని రచయిత తెలిపారు. వ్యాఖ్యత గా నవీన్ అథిదులనందరిని సభకు పరిచయం చేసారు. వాట్ జి నుండి రాజ్, మహేష్  వాటానుండి  హరి, నవీన్, సాయి, అనురాధ లతో పాటు  అనేక మంది ఎన్.ఆర్.ఐ లు పాల్గొని సభను విజయవంతం చేసారు

 

V-prakash-says-NRIS-should-active-in-politics_2

Source:Ravinder Ryada

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here