తెలంగాణా ప్రకాష్:ఓ అభినవ కొమురం భీమ్

0
11330

ఒకప్పుడు జల్-జమీన్-జంగల్ అనే నినాదంతో కొమరం బీం పనిచేసాడు. ఈ తరంలో తెలంగాణా మేదావి వి.ప్రకాష్ అభినవ కొమరం భీమ్ లా పని చేస్తున్నాడని కొమరం భీమ్ సినిమా దర్శకుడు శ్రీదర్ గారు అభివర్ణించాడు. తెలంగాణా కోసం ఒకప్పుడు గిరిజనుల హక్కుల కోసం , భూ హక్కుల కోసం ,నీటి కోసం కొమరం భీమ్ పోరాటాలు చేస్తే ,ఈ తరంలో తెలంగాణా ప్రకాష్ గిరిజనుల కోసం పోరాడాడని ,తెలంగాణా ఉద్యమంలో స్వంత గడ్డ కోసం పోరాడాడు అని . ఇప్పుడు తెలంగాణా లో నీటి ఎద్దడి ని నివారించేందుకు మంచి కార్యక్రమాలను చేస్తున్నాడని హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో తెలంగాణ జల సంరక్షణ వేదిక ఆవిర్భావ వేదిక ప్రారంభ వేడుకలలో చెప్పాడు.

బంగారు తెలంగాణా ని సాదించాలంటే తెలంగాణా లో మొదట నీటి ఎద్దడిని పరిష్కరిస్తేనే అది సాధ్యమని ,తెలంగాణా ఉద్యమం లో మనం సాదించిన లక్ష్యాలు 2% మాత్రమే అని ,మిగతా 98% శాతం లక్షాలు సాధించినపుడే బంగారు తెలంగాణా వస్తుందని తెలంగాణా ప్రకాష్ అన్నాడు. గత 7 ఏళ్లుగా 5 ఏళ్ళు తెలంగాణాలో వర్షాలు బాగా పడ్డాయని కాని వాటిని ఒడిసి పట్టుకోవటంలో మనం విఫలమయ్యామని చెప్పారు,సడక్ కా పాని సడక్ కా ,ఘర్ కా పాని ఘర్ కా ,ఖేత్ కా పాని కేత్ కా (రోడ్ల మీద ఉన్న నీరు రోడ్లకే చెందాలి ,ఇంట్లో పడ్డ నీరు ఇంటికే చెందాలి ,పొలంలో పడ్డ నీళ్ళు పోలానికే చెందాలి ) అని సి.ఎం కెసిఆర్ గారి మాటలను గుర్తు చేసారు. కెసిఆర్ గారి ప్రేరణతో , దక్షిణ భారత గాంధీ అయ్యప్ప గారి స్పూర్తితో ఈ జల సంరక్షణ వేదిక మొదలైందని ఉద్గాటించాడు. 2020 వరకు జలాలతో నిండిన తెలంగాణా ని ఏర్పాటు చేయటానికి ఈ వేదిక సర్కార్ కి ఉడత భక్తిలా పనిచేస్తుందని చెప్పారు. ఈ ట్రస్ట్ లో వివిధ రంగాల్లో గల వ్యక్తులు ,ఎన్.అర్. ఐ లు స్వచ్చందంగా పని చేయటానికి వస్తున్నారని చెప్పారు.

సాక్షి ఎడిటర్ రామ చంద్రా మూర్తి మాట్లాడుతూ ఒకపుడు మీడియా పరిమితి తక్కువ ఉన్నపుడు బాబ్లి ప్రాజెక్ట్ ని అక్రమంగా కట్టుతున్న సమయంలో రిపోర్ట్ చేయటానికి ఎవ్వరు దైర్యం చేయని సమయంలో ప్రకాష్ వెళ్లి ఎవరికీ తెలియకుండా ఫోటోలు తీసి బాబ్లి అక్రమ ప్రాజెక్ట్ నిర్మాణం గురుంచి ప్రపంచానికి పరిచయం చేసి తెలంగాణా కి పెద్ద సహాయం చేసాడని ,తెలంగాణా వచ్చిన తర్వాత నీటి కోసం మంచి కార్యక్రమాలను చేస్తున్నాడని ప్రశాసించాడు.

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ స‌భ్యులు విఠ‌ల్ మాట్లాడుతూ తెలంగాణా ఉద్యమంలో మమల్ని తీరిక లేకుండా పని చేయించిన ప్రకాష్ గారు ,ఇపుడు కూడా అదే రీతిలో పని చేస్తున్నడని చమత్కరించాడు.

తెలంగాణా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (TITA) సహాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి, జోగు రామ‌న్న‌, జూప‌ల్లి కృష్ణారావుల, రాష్ట్ర ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షులు సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి , చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, హైద‌రాబాద్ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్, అయ్యప్ప మసగి , తెలంగాణ జ‌ల సంర‌క్ష‌ణ వేదిక సభ్యులు భవాని రెడ్డి , నిశాంత్ , తెలంగాణా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (TITA) గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తలా ,వైస్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ బొజ్జం,ఇతర TITA ప్రతినిధులు వెంకట వనం ,కిరణ్ జెట్టి ,మోహన్ రాయుడు ,నరేష్ రాగి ,ప్రదీప్ ,రవీందర్ ర్యాడ ,శంకర్ దొంతి ,యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Author:Raja shekar Ryada

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here