ఉప్లూర్ టూ నాసా

0
431
uploor-student-selected-to-nasa
uploor-student-selected-to-nasa

నిజమాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలంలో ఉప్లూర్ గ్రామానికి చెందిన హిమశ్రీ కి నాసా నుంచి అపూర్వ అవకాశం లభించింది. ఉప్లూర్ గ్రామానికి చెందిన చిల్కూరి నవీన్ – సంధ్య దంపతుల కూతురు హిమశ్రీ హైదరబాద్ లోని కొంపల్లి శ్రీ చైతన్య పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. హిమశ్రీకి అమెరికా లోని అంతరిక్ష పరిశోదన కేంద్రంలో పరిశోదనల నిమిత్తం ఆహ్వనం లభించింది. దీంతో కుటుంబ సభ్యులలో ఆనందం వెల్లిబురిసింది. భగీరథ ప్రాజెక్ట్ పై ఆరు నెలల పాటు పరిశోధనలు చేసిన ఆరుగురు విద్యార్థులు అమెరికా లోని నాసా కేంద్రానికి ప్ర్రాజెక్ట్ వివరాలు పంపించగా వారికి నాసా అంతరిక్ష కేంద్రంలో పరిశొదనల నిమిత్తం వారిని ఎంపిక చేయడం జరిగింది. ఈ విద్యార్థులకి పాఠశాల ప్రిన్సిపల్ రాం బాబు వైస్ ప్రిన్సిపల్ రమ్య ప్రోద్భలం తోడవటంతో వారు నాసా నుంచి అరుదైన అవకాశాన్ని పొందారు. హిమ శ్రీ కి వారి కుటుంబ సభ్యులకి ఉప్లూర్ గ్రామ సర్పంచ్ రేగుంట భూమాయి దేవెందర్ ,ఏ ఎన్ ఎం కృష్ణవేణి, వైద్యుడు శంకర్, రెడ్ క్రాస్ సొసైటి మండల అధ్యక్షుడు ఆవారి అశోక్ , ఆకుల రమేష్ గ్రామ పెద్దలు అభినందనలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here