పెళ్ళి పందిట్లో వధువుకి వచ్చిన మెసేజ్-ఆగిపోయిన పెళ్ళి

0
526
unexpected message to bride- marriege cancelled
unexpected message to bride- marriege cancelled
    కొంత కాలం నుండి సోషల్ మీడియా యువతను కొత్త పంథలోకి నెట్టెస్తుంది. సమయాన్ని వృధా చేస్తూ కొంత మంది కొత్త కొత్త పరిచయాల కోసం కొంత మంది ఈ సోషల్ మీడియా రక్కసికి బలైపోతున్నారు. అలాగే టెక్నాలజీ కూడ రోజు రోజు కి కొత్త ఆవిష్కరణలతో పరుగులుపెడుతుంది. ఈ సోషల్ మీడియా వల్ల కొన్ని మంచి పనులు జరుగుతున్న కొంత మాత్రం చెడు కూడ ఉందనే చెప్పాలి.
    వరంగల్ జిల్లాలో ఈ రోజు జరిగిన ఒక సంఘటన వలన పందిట్లోనే పెళ్ళి ఆగిపోయింది. వరంగల్ జిల్లాకి చెందిన యువతికి కృష్ణ జిల్లాకి చెందిన యువకుడితో పెళ్ళి నిశ్చయమయింది. ఈ రోజు వారి వివాహ సమయానికి అనుకోని విధంగా వధువుకి ఒక SMS వచ్చింది. దానిలో ఇప్పుడు మీరు వివాహం చేసుకుంటున్న పెళ్ళి కొడుకు తనని ప్రేమించి మోసం చేసాడని ఇప్పుడూ మీతో వివాహనికి సిద్దమయ్యాడని తెలిపారు. ఈ విషయాన్ని పెళ్ళి కూతురు ఆ వ్యక్తిని నిలదీసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో ఆ వ్యక్తిని పోలీసులు పందిట్లోనే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here