నిరుద్యోగం , ప్రస్తుతం ఎక్కువగా వినపడుతున్న మాట.
ఉపాధి లేక ఉద్యోగ నియమాకాలు లేక యువత నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. మన తెలుగు రాష్ట్రాలలో నిరుద్యోగులు లక్షల్లో ఉన్నారు. అడపాతడపా నియామకాలు జరుగుతున్న అందులొ ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. పైసలకి కక్కుర్తిపడి కొందరు తప్పుడు నియామకాలు చేస్తున్నారు. అలాంటి సంఘటనే ఇదీ. హైదరాబాద్ పౌర సరఫరాలశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలను ఒక్కో పోస్టుకు రూ.2 లక్షల చొప్పున తీసుకుంటున్నారటా.
నోటిఫికేషన్ లేకుండా నక్షత్ర ఔట్సోర్సింగ్ సంస్థ ద్వారా దొడ్డిదారిన నియామకాలు చేపట్టి పైసలు దండుకుంటున్నారని నిరుద్యోగులు, విద్యార్థులు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీహెచ్ఆర్డీ) వద్ద ధర్నా చేసారు.
ఓయూకు చెందిన విద్యార్ధులతోపాటు నిరుద్యోగులు ఎంసీహెచ్ఆర్డీ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు