అగ్లీ సినిమా రివ్యూ: చిన్న సినిమా…రంగస్థల నటులతో కొత్త ప్రయోగం

0
87

తెలుగు లో చిన్న సినిమాలకు ఈ రోజుల్లో కు ముందు, తర్వాత అని చెప్పుకొవాలి. తెలంగాణ సినిమాలకు పెళ్లి చూపులు కు ముందు తర్వాత అని చెప్పుకోవాలి.ఎందుకంటే ఈ రెండు సినిమాల వల్ల ఎంతో మంది చిన్న సినిమా నిర్మాతలకు దర్శకులకు సాంకేతిక నిపుణులకు ఎనలేని ధైర్యాన్ని ఇచ్చాయి. ఆలా తెలుగు సినిమాల్లో దర్శకత్వ విభాగంలో పనిచేస్తూ సినిమానే ఊపిరిగా జీవిస్తున్న తెలంగాణ కుర్రాడు సుశాంత్ బండారి నిర్మాతగా దయ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో నిజాలు అందవిహీనంగా ఉంటాయని (sometimes truth is ugly ) అనే ఒక కొత్త టాగ్ లైన్ తో అగ్లి (ugly) అనే లో బడ్జెట్ థ్రిల్లర్ సినిమా విడుదల అయింది.మరి సినిమా ఎలా ఉందొ చూద్దాం…

కథ
ఇది ఒక డ్రగ్ కి బానిస అయిన యువకుడు తేజ ఇంటి నుంచి పారిపోయిన తర్వాత పోలీసుల నుంచి నుంచి తప్పించుకునే సమయంలో ఒక ఇంట్లో దాక్కొంటాడు. తర్వాత
ఇంట్లో జరిగిన సంఘటనలు ఏంటి ?తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అనేది సినిమా ..

విశ్లేషణ
దర్శకుడు దయ రాసుకున్న కథలో విభిన్నత లేకపోయినా కథనం మాత్రం బాగుందనే చెప్పాలి.తర్వాత ఏం జరుగుతుందో అని సస్పెన్స్ ని సినిమా ముగింపు వరకు కొనసాగించడంలో తక్కువ బడ్జెట్ లో తీయటంలో విజయవంతం అయ్యాడని చెప్పొచ్చు. కాని ఎమోషన్లు పండించటంలో ఇంకా కొంత శ్రద్ధ తీసుకుంటే బాగుండేది . ఈ సినిమాలో మరో ప్లస్ పాయింట్ డ్రగ్ కి బానిస అయిన అబ్బాయి పాత్ర పోషించిన పరితోష్ తివారి పాత్రలో జీవించాడు. ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే ఆర్టిస్టులు అందరు థియేటర్ ఆర్టిస్టులు కావడంతో అందరు పాత్రల్లో ఒదిగిపోయినారు. rx 100 సినిమాకు నేపథ్య సంగీతం అందించిన స్మరన్ ఇచ్చిన సంగీతం బాగుంది. ముక్యంగా ప్రమోషనల్ సాంగ్ బాగున్నా దాన్ని సినిమాలో ఎందుకు పెట్టలేదో అర్థం కాలేదు.

ప్లస్ పాయింట్స్
1) కథనం ,దర్శకత్వం
2) పరితోష్ తివారి నటన
3) నేపథ్య సంగీతం
4) తక్కువ బడ్జెట్ లో అయిన కూడా నిర్మత సినిమా మీద ఉన్న కమిట్మెంట్ కనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్
1) ఫోటోగ్రఫీ
2) పోలీస్ అధికారి పాత్రధారి రోహిత్ బాగా చేసినా డబ్బింగ్ వేరే వాళ్ళతో చేయిస్తే బాగుండేది.

రేటింగ్ : 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here