ఈ ఇంటర్వ్యూతో చిరు మీద అనుమానాలు తొలిగినట్లేనా?

0
1474

కొన్ని నిజాలు ఒక సంఘటన జరిగిన వెంటనే తెలిసిపోతాయి, కొన్ని నిజాలు ఆలస్యంగా బయటకు వస్తాయి , కొన్ని వాస్తవాలు మాత్రం కాలగర్భంలో కలిసిపోతాయి. ఆలా నిజాలు సమాజానికి తెలియకముందు ఎన్నో రూమర్లు ,గాలి వార్తలు వస్తుంటాయి. అలాంటి సమయంలో ఎంతో మంది బాధ పడుతూవుంటారు. పై వాటిలో రెండవ కోవకి చెందిన సంఘటనకి ఉదాహరణగా ఉదయ్ కిరణ్ -చిరంజీవిల వివాదాస్పద సంఘటన ప్రధానంగా చెప్పుకోవాలి. 2002 సమయంలో ఉదయ్ కిరణ్ అనే వ్యక్తి తెలుగు సినిమా ఇండస్ట్రీలో దూసుకొచ్చిన ఒక తారాజువ్వ . చిత్రం ,నువ్వు నేను ,మనసంతా నువ్వే లాంటి హ్యాట్రిక్ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీకి ఒక లవర్ బాయ్ దొరికాడని అటు ఇండస్ట్రీ ఇటు తెలుగు జనాలు సంబరపడిపోయారు. అమ్మాయిల్లో క్రేజ్ మాత్రం ఆకాశంలో ఉండేది. చూడడానికి చాలా సిన్సియర్ గా ఉండే ఉదయ్ కిరణ్ కి చాలా మంది అభిమానులు అయిపోయారు. స్వతహాగా చిరంజీవికి వీరాభిమాని అయిన ఉదయ్ కిరణ్ కి చిరంజీవి కూతురు సుస్మిత తో పెళ్లి సెట్ అయింది. కాని కొన్ని కారణాల వలన ఆ పెళ్లి పీటలు ఎక్కకుండానే రద్దు అయింది.

    ఆ సమయం నుంచి ఉదయ్ కి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు. చేతిలో ఉన్న సినిమాలు అన్ని మాయం అయిపోయాయి. దీనికి కారణం చిరంజీవి అని గుసగుసలు మొదలు అయ్యాయి. ప్రధానంగా ఎంగేజ్మెంట్ తర్వాత పూరి జగన్నాద్ డైరెక్షన్లో నాగబాబు నిర్మాణంలో గ్రాండ్ గా లాంచ్ అయిన ఉదయ్ సినిమా రద్దు కావటంపైనా ఆ వార్తలకు నిజం ఉందని జనాలు నమ్మసాగారు. దీనితో పాటు చిరంజీవి పైన అయన కుటుంబం పైన జనాల్లో మొదటిసారిగా వ్యతిరేకత మొదలు అయ్యాయి. దీనితో ఉదయకిరణ్ పైన సింపతీ మొదలైంది. ఈ సంఘటన వలన చిరు పైన ఉన్న మంచి అభిప్రాయం మెల్లిగా కరిగిపోయింది. ఎంతలా అంటే చిరంజీవి ప్రజారాజ్యం లో టిక్కెట్లు అమ్ముకున్నారనే వాదనకి బలం చేకూర్చేలా….
      • ఇలా కట్ చేస్తే చిరంజీవి కూతురు కి ,ఉదయ్ కిరణ్ కి వేరే వేరే వ్యక్తులతో పెళ్లిళ్లు జరగటం ,తర్వాత ఉదయ్ అనుకోని కారణాలతో ఆత్మహత్య చేసుకోవటం జరిగిపోయాయి. ఐతే ఉదయ్ శకం ముగిసిపోవడంతో ఆ ఉదయ్ చిరు ల వివాదం ముగిసిపోయిందని అందరు అనుకుంటున్న తరుణంలో ఉదయ్ వాళ్ళ అక్కయ్య ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. చిరు ఉదయ్ ల గురించి మాట్లడుతూ ఉదయ్ కి వేరే అమ్మాయి తో బ్రేక్ అప్ అయిందని ,దానితో డిప్రెషన్ లో ఉన్న ఉదయ్ ని చిరు చాల సార్లు ఓదార్చాడని ఇంటర్వ్యూ లో చెప్పింది. అంతే కాకుండా చిరు కూతురరికి ఉదయ్ అంటే ఇష్టం ఉండటంతో మొదటగా చిరునే ఉదయ్ తో పెళ్లి ప్రపోజల్ చేయటంతో ఎంగేజ్మెంట్ అయిందని చెప్పింది.చిరు కుటుంబానికి తన కుటుంబం సరితూగదని ముందుగానే గ్రహించిన ఉదయ్ పెళ్లి రద్దు చేశాడని చెప్పింది.చిరు గురుంచి అయన కుటుంబం గురుంచి మాట్లాడుతూ ఆయన చాలా మంచి మనిషి అని ,వాళ్ళు చాల మర్యాదస్తులు అని చెప్పుకొచ్చింది. చిరు ఉదయ్ మీద ఎప్పుడు కూడ పగ తీర్చుకోలేదని చెప్పింది. ఆ తర్వాత చిరుకి ఆరోగ్యం బాగాలేనపుడు ఆమె చిరుకి ఫోన్ చేసి ఆరోగ్యం గురుంచి అడిగి తెలుసుకున్నానని తెలియచేసింది.
    ఏది ఏమైనా ఈ ఇంటర్వ్యూ తో చిరుపైన ఉన్న అనుమానాలు తొలిగిపోయినట్లేనేమో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here