బాకీ పోయే

0
440
ts govt announce runa maafi
ts govt announce runa maafi
    తెలంగాణ రైతన్నల్లో ఆనందం వెల్లు విరిసే సమయం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మన రైతన్న కి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చిన సందర్భం.
    రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల పంట రుణాల మాఫీకి తుది విడత నిధులను విడుదల చేసింది. ఈ రుణ మాఫీ కింద రూ.4 వేల కోట్లు విడుదల చేస్తూ ఆర్థికశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ విడుదల చేసిన రూ.4 వేల కోట్లలో.. వ్యవసాయశాఖకు రూ.2957.47 కోట్లు , ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధికి రూ.656.62 కోట్లు ,ఎస్టీ ప్రత్యేక అభివృద్ధినిధికి రూ.385.90 కోట్లు విడుదలచేసింది.
    టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు రుణమాఫీని అమలుచేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.మన రాష్ట్రంలో 35.3 లక్షల మంది రైతులకు రూ.లక్ష లోపు పంట రుణాల మాఫీకిగాను రూ.17 వేలకోట్ల మేరకు నిధులు అవసరమవుతాయని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు ఏడాదికి 25శాతం చొప్పున నాలుగు విడతల్లో రుణమాఫీ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.తుది విడతగా రూ.4 వేల కోట్లు రైతు అకౌంట్లలోకి జమ కావడంతోనే రుణమాఫీ పథకం అమలు పూర్తికానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here