దుబ్బాక ,గ్రేటర్ ఎన్నికల తర్వాత తెరాస అధిష్ఠానం మేధోమదనం మొదలైన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.ఇంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు,జడ్పీటీసీలు,ఎంపీటీసీలు,మేయర్లు ఉన్నా కూడా తెరాస ఓటమికి కారణాలు ఏంటని వెతుక్కునే ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తుంది. స్వంత పార్టీలో కోవర్టుల వల్లే పార్టీ నష్టపోయిందని ఒక అంచనగా వచ్చినట్లు కనిపిస్తుంది.ప్రధానంగా తెరాస బలంగా కనిపించే ఉత్తర తెలంగాణ ,వరంగల్ ప్రాంతాల్లో తెరాసలో కోవర్టులు బీభత్సంగా ఉన్నారని తెలుస్తుంది.దానికి తోడు ఇటీవల ఎర్రబెల్లి దయాకరరావు మీద పరోక్షంగ ఒక వార్తా పత్రిక కోవర్ట్ మంత్రి అని ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో షాడో ఇమేజ్ అచ్చం ఎర్రబెల్లి లాగా ఉండటం,కథనం కూడా ఆయన నేపథ్యం కు పోలి ఉండటంతో సోషల్ మీడియా లో ఆ మంత్రి ఎర్రబెల్లి అని నెటిజన్లు కన్ఫర్మ్ చేశారు.దీంతో తేరుకున్న ఎర్రబెల్లి, తన మీద పడ్డ మచ్చను తొలగించుకోవడానికి మొన్న బండి సంజయ్ మీద విమర్శలు చేసి భాజపా వర్సస్ తెరాస వయ ఎర్రబెల్లీ అనే యుద్ధానికి తెరలేపారు.దీంతో తెరాస పార్టీ శ్రేణుల్లో ఎర్రబెల్లి మన వాడే అనే భావనను నింపటంలో ఎర్రబెల్లి విజయవంతం అయ్యారని చెప్పొచ్చు.దీంతో ఎర్రబెల్లి స్వీయ శీల పరీక్షలో భాగంగానే సంజయ్ మీద విమర్శలు చేసారని రాజకీయ విశ్లేషకుల భావన.మరి ఎర్రబెల్లి తనకు తాను పెట్టుకున్న శీల పరీక్ష లో నెగ్గడా లేదా అనేది వరంగల్ మున్సిపల్ ఎన్నికల వరకు ఆగితే తెలుస్తుంది.రోజు రోజుకు తెరాస కు దూరం అవుతున్నాడు అనే వార్తలతో సతమతమవుతున్న ఈటెల కూడా నిన్న భాజపా ను విమర్శించడం కొసమెరుపు
