త్రివిక్రమ్ కి చంద్రబోస్ గుర్తుకురాలేదా?

0
1122

ఒక్కోసారి కొన్ని మాటలకు చాలా అర్థాలు వెదుకొవచ్చు, రాజు చిన్న భార్య మంచిది అంటే పెద్దామె చెడ్డది అనే అర్థం చాల సార్లు కల్గుతుంది. ముఖ్యంగా ఇండస్ట్రీ లో ఐతే ఆ పరిణామాలు వేరు. ఇటివల ఒక సంఘటన లో ఇలాగ జర్గుతుంది. అ ఆ .. సినిమా ఆడియో ఫంక్షన్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేసిన మాటలు కొందరిని హర్ట్ చేసాయని వినికిడి .

అసలు విషయానికొస్తే త్రివిక్రమ్ జోగయ్య శాస్త్రి గురుంచి మాట్లాడుతూ “గురువు గారు సిరివెన్నెల తర్వాత అంతటి స్తాయి ని అందుకున్న రచయిత రామజోగయ్య గారు ” అన్నాడు . ఈ మాటలు విన్న చంద్ర బోస్ గారి స్నేహితులు కలత చెందారట. 15 ఏళ్ల పాటు రెహమాన్ నుంచి ఇపుడిపుడే పైకి వస్తున్న సంగీత దర్శకుడికి వేల పాటలు రాసి,తెలుగు లో కొత్త పదాల సృష్టించిన చంద్రబోసు గారిని ఎలా మరిచిపోతారు అని అంటున్నారట. నిజానికి సిరివెన్నెల ,బాలు గారు,దాసరి ,రాఘవేంద్ర రావు గారి లాంటి వాళ్ళు చంద్రబోస్ గురుంచి చాలా సార్లు ప్రస్తావించారు. ఒక సరి పాడుతా తీయగా లో బాలు గారు చంద్ర బోసు ని ఉద్దేశించి సిరివెన్నెల తో ” నీ తర్వాత తెలుగు ఇండస్ట్రీ లో పద ప్రయోగం చేసే వాడు ఒకడున్నాడు తెలుసా !అయన ఎవేరో కాదు చంద్రబోసు ” అని అన్నాడు.

మాములుగా బాలన్స్ గా మాట్లాడే త్రివిక్రమ్ గారు ఎందుకో తన ఫంక్షన్ లో ఇలా మాట్లాడి కొందరి మనోభావాలను దెబ్బతీసాడు. రామజోగయ్య చాలా మంచి రచయితే కాని చంద్రబోస్ ని మరిచిపోవటం కరెక్ట్ కాదని అంటున్నారు.త్రివిక్రమ్ సార్ ! వింటున్నారు కదా !

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here