బస్ స్టాప్ హీరోని హార్ట్ చేసిన పోలీసుల కెమెరా చలాన్

0
2056

ఒక్కోసారి కొన్నిఅనుకోని సంఘటనలు కొందరిని హార్ట్ చేస్తాయి . అవి వ్యక్తి వలన జరిగే తప్పిదాల వలన కావొచ్చు ,ఒక సమూహం వలన కావొచ్చు లేక వ్యవస్థ తప్పిదాల వలన కావొచ్చు . ఆ బాధితుల లిస్టులో సామాన్యులు ఉండవచ్చు ఒక్కోసారీ ప్రముఖులు కూడా ఉండవచ్చు. సామాన్యుల విషయంలో అన్ని సంఘటనలు బయటకు రాకపోవటం వలన చాలా మందికి తెలియకపోవచ్చు కానీ సెలెబ్రెటీలకు జరిగినపుడు వాళ్లకున్న మాద్యమాలతో అందరికి తెలుస్తుంది. కానీ సోషల్ మీడియా ఉదృతం అయ్యాక ప్రపంచంలో ఏ మూల ఏమి జరిగిన కూడా తెలిసిపోతుంది.

అసలు విషయానికొస్తే ఈ మద్య కాయ్ రాజా కాయ్ , బస్ స్టాప్ సినిమాల ఫేమ్,హీరో రామ్ ఖన్నా కి హైద్రాబాద్ ట్రాఫిక్ వ్యవస్థ నుంచి ఒక చేదు అనుభవం ఎదురైంది. ఈ నెల 15 న ఆయన కారు (AP09 CV 1248) హిమాయత్ సాగర్ వద్ద మితిమీరిన వేగం తో వెళ్లిందని ఆయనకు ఆన్లైన్ లో చలాన్ వచ్చింది. ఆ చలాన్ లో ఫోటో చూసి షాక్ అయ్యాడు ఖన్నా ఎందుకంటే ఆ ఫొటోలో ఉన్న ఆ కారు వేరు ఈయన కారు వేరు . ఈయనది గ్రే రంగు గల వోక్స్ వాగన్ పోలో (polo) అయితే, ఫోటో లో ఉన్నది మాత్రం తెలుపు రంగు గల వోక్స్ వాగన్ వెంటో (vento-AP09 CU 1248). అయితే రెండో కారు నంబర్ మొదటి నంబర్ దాదాపు ఒకే విదంగా ఉండటం వలన (ఖన్నా కార్ CV అయితే తెల్ల కారు CU). అంతే కాకుండా రెండో వాహనం ఫోటో, అతివేగం వలన పిక్చర్ బ్లర్ అయింది దీని వలన చూసే వాళ్లకు యూ(U) బదులు వి(V) లా కనిపించటం వలన పాపం ట్రాఫిక్ కంప్యూటర్ సిస్టమ్ వేరే వ్యక్తికి 1500 రూపాయల చాలను వేసింది. ఈ విషయం తెలిసిన తెలిసి షాక్ తిన్నరామ్ ఖన్నా తన ఫెసుబూక్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.

టెక్నాలజీ అందుబాటులో ఉందని మురిసిపోతు దానిని సరిగ్గా వినోయోగించకుంటే వచ్చే పరిణామాలు ఇలానే ఉంటాయి. ఇప్పటికైనా హైద్రాబాద్ ట్రాఫిక్ వాళ్ళు మంచి కేమెరా లు ఉపయోగిస్తే ఇలాంటి చేదు అనుభవాలు ఎదురు కావు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here