టీపీఎల్ -2 బ్రోచ‌ర్‌, టీజ‌ర్ లాంచ్

0
345

2015లో తొలి తెలంగాణ ప్రీమియ‌ర్ లీగ్‌ తో ఆక‌ట్టుకుంది , ఇపుడు స‌రికొత్త హంగులతో అభిమానాలను అలరించటానికి  చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఇపుడు  గ్రామీణ టాలెంట్‌ను అంద‌రికి ప‌రిచ‌యం చేయాల‌నే ల‌క్ష్యంతో సీజ‌న్ 2 అభిమానుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే రంగు రంగుల హంగుల‌తో సిద్ధ‌మైన టీపీఎల్ సీజ‌న్ 2, బ్రోచ‌ర్‌, టీజ‌ర్‌ను ప్ర‌ముఖ స్పోర్ట్స్ ఎన‌లిస్ట్ సి.వెంక‌టేష్ రిలీజ్ చేశారు.

టీపీఎల్‌..గ్రామీణ టాలెంట్‌కు వేదిక

టీపీఎల్ -2 బ్రోచ‌ర్‌, టీజ‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న స్పోర్ట్స్ ఎన‌లిస్ట్ సి. వెంక‌టేష్‌, ఏ ల‌క్ష్యంతో అయితే టీపీఎల్ ను ప్రారంభించామో ఆ దిశ‌గా మొదటి సీజన్లో స‌క్సెస్ కావ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఆదిలాబాద్ త‌ర‌పున ఆడిన ప్లేయ‌ర్, ప్ర‌జెంట్ హెచ్‌సీఏ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడ‌ని తెలిపారు. కొత్త నిర్వ‌హ‌కుల చేతిలో లీగ్ మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా వ‌స్తుంద‌న్న ఆయ‌న‌, మార్చి 24 నుంచి ఏప్రిల్ 2వ‌ర‌కు రెండో ఎడిష‌న్ జ‌రుగుతుంద‌న్నారు.

రూర‌ల్ టాలెంట్‌కు వేదిక టీపీఎల్‌

తొలి ఎడిష‌న్‌ను మించి, రెండో సీజ‌న్‌ను నిర్వ‌హిస్తామ‌న్నారు టీపీఎల్ డైరెక్ట‌ర్ ఆఫ్ ఆప‌రేష‌న్స్ విద్యాసాగ‌ర్ రావు. ఎల్‌బి స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు. 66ఫ్రేమ్స్‌.కామ్‌లో మ్యాచ్‌ల‌ను లైవ్‌లో టెలికాస్ట్ చేస్తామ‌న్న ఆయ‌న‌, మ‌రింత మెరుగ్గా ఆరంభ వేడుక‌ల‌తో పాటు మ్యాచ్‌ల‌ను కండ‌క్ట్ చేస్తామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో 66ఫ్రేమ్స్‌.కామ్ రామ్ రంజ‌న్‌తో పాటు, టీపీఎల్ మార్కెటింగ్ డైరెక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here