37.2 C
Hyderabad
Friday, March 29, 2024
Homeవీడియోలుకేటీఆర్ కి గల్ఫ్ జేఏసీ బహిరంగ లేఖ

కేటీఆర్ కి గల్ఫ్ జేఏసీ బహిరంగ లేఖ

Date:

Related stories

తెలంగాణ మున్నూరుకాపు మరియు విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తెలంగాణ మున్నూరుకాపు మరియు విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ...

శీర్షిక: భోళా శంకరుడు

గంగాధరుడికి గంగతో అభిషేకములింగ దర్శనమే కైలాస దర్శనమునిత్యం పంచాక్షరి మంత్ర జపముసర్వ...
spot_imgspot_img
శ్రీయుత గౌరవనీయులైన శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), తెలంగాణ రాష్ట్ర మంత్రి గారు
అయ్యా!
ఏడేళ్ల క్రితం… మీరు తేది: 27.07.2016 నాడు హైదరాబాద్ లో ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) రూపకల్పనకు అధికారులు, వివిధ దేశాల నుంచి వచ్చిన తెలంగాణ ప్రవాసులు, వలస కార్మిక సంఘాల ప్రతినిధులు, విద్యావేత్తలు, రిక్రూటర్స్ తో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఒక విధానం తెస్తుందని హామీ ఇచ్చారు. మీ హామీకి గల్ఫ్ హామీకి ఏడేళ్లు నిండాయి.
బొగ్గుబాయి – బొంబాయి – దుబాయి నినాదంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న గల్ఫ్ ప్రవాసుల పాత్ర మరువలేనిది. ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్ల వార్షిక కేటాయింపులు చేయాలని, గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఆనాటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2014 ఎలక్షన్ మేనిఫెస్టోలో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి హామీలు ఇచ్చారు. ఇప్పటి వరకు హామీలను అమలు చేయలేదు.
ఇకనైనా గల్ఫ్ హామీలను నెరవేర్చాలని కోరుతున్నాము. 15 లక్షల మంది గల్ఫ్ కార్మికులు, మరో 15 లక్షల మంది గల్ఫ్ రిటనీలు, వారి కుటుంబ సభ్యులు కలిపి మొత్తం ఒక కోటి మంది కోరికను, అభిప్రాయాన్ని గౌరవించి తగిన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాము. లేదంటే సిరిసిల్ల నుండే మరో ఉద్యమం ప్రారంభ కావడానికి మీరే బాధ్యులు అవుతారని మనవి చేస్తున్నాము.
ఇట్లు
గుగ్గిల్ల రవిగౌడ్, చైర్మన్, గల్ఫ్ జెఏసి +91 89783 73310
స్వదేశ్ పరికిపండ్ల, జనరల్ సెక్రెటరీ, గల్ఫ్ జెఏసి +91 94916 13129

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here