నటనకు స్వస్తి చెప్పనున్న టాలీవుడ్ యువ నటుడు

0
720
Tollywood young hero say good bye to movies
Tollywood young hero say good bye to movies
    తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరోగా లేదా ఏదైన హీరోయిన్ గా నెట్టుకురావడం అంతా ఆశామాషి కాదు. టాలీవుడ్ లో తెలిసిన వాళ్ళు లేదా అత్యద్భుతంగా రాణించేలా నటన ఉండాలి. అందులో ఏదీ లేకున్న ఈ పరిశ్రమలో ఉండటం అంత సులభం కాదు. కానీ అన్ని అవకాశాలు ఉన్న ఒక యువ నటుడు టాలీవుడ్ రాకింగ్ స్టార్ గా మంచి పేరు ఉన్న మంచు మనోజ్ నటనకు గుడ్ బై చెప్పనున్నారు.

    ఈయన ఇప్పటి వరకి 21 సినిమాల్లో నటించారు.మనోజ్ నటించి “ఒక్కడు మిగిలాడు” మూవీ టీజర్ జూన్ 15న రిలీజ్ కాబోతుంది. దీని తర్వాత మరో సినిమా చేస్తున్నానని అదే తన చివరి సినిమా అని మనోజ్ ట్వీట్ చేశారు.

    ఈ నిర్ణయం తో మంచు ఫాన్స్ తో పాటు తనతో నటిస్తున్న నటీ నటులు కూడా షాక్ అయ్యారు. ఇంతకూ మనోజ్ ఈ నిర్నయం ఎందుకు తీస్కున్నాడు దీనికి కారణం ఏమిటి అనే దానిపై పెద్ద చర్చే జరుగుతోంది. అటు సోషల్ మీడియాలో సైతం చర్చలు జరుగుతున్నాయి. వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నట్టు కొందరు లేదు తమ సొంత ప్రొడక్షన్ హౌజ్ లను చూసుకుంటారని మరొకరంటున్నారు.

    ఇంత త్వరగా యంగ్ హీరోల్లో యాక్టింగ్ కు గుడ్ బై చెప్పిన నటులు చాలా అరుదు. సొంత బ్యానర్ ఉండి సొంతంగా సినిమాలు నిర్మించగల ఆర్థిక స్థోమత ఉండి కూడా ఈ వయసులో సినిమాలకు గుడ్ బై చెప్పడం చర్చకు దారితీస్తోంది. దీనిపై మంచు ఫ్యామిలీ ఎలాంటి సమాధానం ఇస్తుంది అనే విషయంపై టాలీవుడ్ పరిశ్రమ వేచి చూస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here