TITA యువ నిర్మాణ్

0
506

 

దేశానికి స్వాతంత్రం కోసం 200 సంవత్సరాలు ఎంతో మంది అమరవీరులు యుక్త వయస్సుని  ,కుటుంబాలను ఆకరికి తమ జీవితాలను త్యాగం చేస్తే చివరికి స్వాతంత్రం వచ్చింది ,కాని దాని తర్వాత దేశం చాల పురిటి నొప్పులను అనుభవిస్తూ  చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది . ఈ విపత్కర పరిస్తితులకు కారణం నడిపించే నాయకత్వ లోపం అని చెప్పొచ్చు ,ఎందుకంటే అన్ని సంవత్సరాలు పరాయి పాలనలో ఉండి  నిజమైన భారత ఆత్మని  కోల్పోయిందని చెప్పొచ్చు ,దాని కారణంగా నాయకుల కి ఎలా పాలించాలో తెలియక  సందిగ్ద పరిస్థితిలోకి వెళ్లారు ,కాని ఈ విషయంలో పూర్తిగా నాయకులని నిందించటానికి లేదు ఎందుకంటే ఆ రోజుల్లో ప్రజలు కూడా పూర్తిగా నాయకుల పైన ఆదారపడ్డారు వాళ్ళేదో చేస్తారని ,దానికి నిలువెత్తు సాక్ష్యం నెహ్రు 1947–64 వరకు ప్రధానిగా ఉండటమే . ఆ తర్వత ప్రజలు మేల్కొన్న అప్పటికే జరగాల్సిన నష్టం  బాగా వాటిల్లింది . అటు చైనా ,ఇటు పాకిస్తాన్ రూపంలో అబద్రత వలయాలు వచ్చాయి.
       తెలంగాణా విషయం లో కూడా ఇదే పరిస్తితి ,ఆత్మ గౌరవం కోసం ఏళ్ళు గా ఉద్యమాన్ని చేసి చివరికి రాష్ట్రాన్ని దక్కించుకున్నారు . ఐతే తెలంగాణా ఉద్యమంలో సమయం లో ఎన్నో జాక్ లు మొదలయ్యి ఉద్యమంలో  పాలు పంచుకున్నాయి,  ఐతే  ఉద్యమ సమయంలో చాల ఆక్టివ్ గా ఉండి తర్వాత ప్రబుత్వం నుంచి ఫలాలు పొంది కొన్ని సంస్థలు వెనక్కి వెళ్లి పోయాయి ,తెలంగాణా ఏర్పడ్డాకా కూడా అలంటి కార్యక్రమాలు చేస్తే బంగారు తెలంగాణాఈజీ గా సాదించొచ్చు. 
      ఐతే ఒక సంస్థ మాత్రం వాటికి భిన్నంగా ముందుకు వెళ్తుంది ,అదే TITA (Telangana Information Information Technology Association). ఉద్యమ నేపథ్యం లో ఆరంబం అయిన ఈ సాఫ్ట్ వేర్ జాక్ ,రాష్ట్ర అవిర్బం తర్వాత కూడా సేవలను కొనసాగిస్తుంది . ముఖ్యంగా యువ నిర్మాణ్ పేరిట నిర్వహిస్తున్న ప్రోగ్రాం కి చాల ప్రసంసలు వస్తున్నాయి .  ఆంద్ర ప్రదేశ్ సంబందించిన మేధావులు ఐతే ఇలాంటి ప్రోగ్రాం ఒకటి వాళ్ళ రాష్ట్రం లో ఉంటె చాల బాగుంటుందని అంటున్నారు .  ఇంజనీరింగ్ ,డిగ్రీ చదువుతున్న విద్యార్థులకి భవిష్యత్తు ని నిర్ణహించే క్లౌడ్ కంప్యూటింగ్ ,hadoop ,మొబైల్ టెక్నాలజీస్ ,డిజిటల్ మార్కెటింగ్,
ఈ -కామర్స్  లాంటి  IT  కోర్సులు ,కమ్యూనికేషన్ స్కిల్స్ ,ప్రాజెక్ట్ మేనజమేంట్ ,ట్రాఫిక్ రూల్స్ అవేర్నేస్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు . అంతే  కాకుండా బతుకమ్మ  లాంటి కార్యక్రమాలను IT ఉద్యోగులతో నిర్వహించి తెలంగాణా సంస్కృతి ని కాపాడే ప్రయత్నం చేసి అందరికి రోల్ మోడల్ గా నిలుస్తున్నారు . భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలనీ , మిగత వాళ్ళు కూడా వీళ్ళ లాగా ముందుకు వెళ్ళాలని కోరుకుందాం . 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here