టీటా మెక్సికో అధ్యక్షుడిగా రాజా శేఖర్ ర్యాడ

0
270

తెలంగాణ ఉద్యమంలో ఐటి ఉద్యోగులను చురుగ్గా పాల్గొనేలా చేసిన సంస్థ తెలంగాణ ఐటి అసోసియేషన్ (TITA). తరువాత డిజిటల్ అక్షరాస్యత ,స్కిల్ డెవలపమెంట్,స్టార్ట్ అప్ కంపెనీల ప్రోత్సాహం ,కాళేశ్వరం ప్రాజెక్ట్ కి టెక్నినల్ సహాయం ,తెలంగాణ కళాకారులకు ఒక కామన్ పోర్టల్ స్థాపించటం ఇలా ప్రతి టెక్నికల్ విషయంలో తెలంగాణ కి సహాయపడుతుందని అందరికి తెలిసిందే. ఇప్పటికే అమెరికా ,కెనడా ,సింగపూర్ లో తమ అనుబంధ టీం లను మొదలుపెట్టిన టీటా
ఇపుడు అమెరికా పక్క దేశం మెక్సికో లో తన టీం ను తయారుచేసుకుని భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధిలో భాగం చేసే విదంగా ముందుకు వెళ్తుంది.

టీటా మెక్సికో ఫౌండర్ అధ్యక్షుడిగా నిజామాబాద్ జిల్లాకు కుకునూర్ గ్రామానికి చెందిన రాజశేఖర్ ర్యాడ ఎంపికయ్యాడు.ఆనంద్ కోలా, ఉపాధ్యక్షుడిగా ఎంపిక అయ్యారు. ప్రస్తుతం మెక్సికో పర్యటనలో ఉన్న టీటా గ్లోబల్ అధ్యక్షుడు సందీప్ మక్తాల,మెక్సికో లో ఉన్న తెలంగాణా ఐటీ ఉద్యోగులతో కలిసి టీటా కార్యక్రమాలను,భవిష్యత్తు ప్రణాళిక గురుంచి తెలియచేసి మెక్సికో చాప్టర్ ని లాంచ్ చేయటం జరిగింది. రాజశేఖర్ మరియు ఇతర సభ్యులు మాట్లాడుతూ అవకాశాన్నిచ్చిన గ్లోబల్ అధ్యక్షుడు సందీప్ మక్తాల కు ,గ్లోబల్ అధ్యక్షుడు రానా ప్రతాప్ బొజ్జం కి మరియు ఇతర కోర్ సభ్యులకు ధన్యవాదాలు తెలియచేశారు.
మెక్సికో చాప్టర్ పూర్తి టీం

రాజశేఖర్ ర్యాడ,అధ్యక్షుడు
ఆనంద్ కోలా,ఉపాధ్యక్షుడిడు
నిఖిల్ నరిశెట్టి – ప్రధాన కార్యదర్శి
హరి ప్రసాద్ నిమ్మడి -ప్రధాన కార్యదర్శి
సంతోష్ నాగరపు, కోశాధికారి
ప్రశాంతి – సంయుక్త కార్యదర్శి
నళిని ప్రసాద్, సలహా సభ్యుడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here