స్వామి వివేకానంద అడుగుజాడల్లో TITA

0
371

దేశానికి స్వాతంత్రం కోసం 200 సంవత్సరాలు ఎంతో మంది అమరవీరులు యుక్త వయస్సుని ,కుటుంబాలను ఆకరికి తమ జీవితాలను త్యాగం చేస్తే చివరికి స్వాతంత్రం వచ్చింది ,కాని దాని తర్వాత దేశం చాల పురిటి నొప్పులను అనుభవిస్తూ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది . ఈ విపత్కర పరిస్తితులకు కారణం నడిపించే నాయకత్వ లోపం అని చెప్పొచ్చు ,ఎందుకంటే అన్ని సంవత్సరాలు పరాయి పాలనలో ఉండి నిజమైన భారత ఆత్మని కోల్పోయిందని చెప్పొచ్చు ,దాని కారణంగా నాయకుల కి ఎలా పాలించాలో తెలియక సందిగ్ద పరిస్థితిలోకి వెళ్లారు ,కాని ఈ విషయంలో పూర్తిగా నాయకులని నిందించటానికి లేదు ఎందుకంటే ఆ రోజుల్లో ప్రజలు కూడా పూర్తిగా నాయకుల పైన ఆదారపడ్డారు వాళ్ళేదో చేస్తారని ,దానికి నిలువెత్తు సాక్ష్యం నెహ్రు 1947–64 వరకు ప్రధానిగా ఉండటమే . ఆ తర్వత ప్రజలు మేల్కొన్న అప్పటికే జరగాల్సిన నష్టం బాగా వాటిల్లింది . అటు చైనా ,ఇటు పాకిస్తాన్ రూపంలో అభద్రత వలయాలు వచ్చాయి.
వాస్తవానికి దేశానికి స్వాతంత్రం రాక మునుపే యువతరానికి మార్గ దర్శకంగా నిలిచినా వారు ఎందరో ఉన్నారు ,ముఖ్యంగా భారతీయ యువత అంటే DNA లో ఉక్కు నరాలు ,ఇనుప కండరాలు కలిగిన జనసత్వాలు అని , వాళ్ళు తమ శక్తి ని గుర్తించలేని అభినవ హన్మంతులు అని చెప్పి తన సిద్దాంతాలతో దేశానికి స్పూర్తినిచ్చిన స్వామి వివేకానంద . కాని అయన స్వాతంత్రం రాక మునుపే మనకి దూరం కావటం మన దురదృష్టం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చాక మన యువత ఒక 20 ఏళ్ళు రాజకీయ నాయకులను పూర్తిగా నమ్మటం వలన దేశం వెనక్కి వెళ్ళింది అని చెప్పొచ్చు ,దేశంలో అన్నా హజారే లాంటి అతికొద్ది మంది స్వామి ని అనుసరించటం వలన వాళ్ళు ఒక మంచి పద్దతిలో వెళ్లి విజయవంతం అయ్యారు.
తెలంగాణా విషయం లో కూడా ఇదే పరిస్తితి ,ఆత్మ గౌరవం కోసం ఏళ్ళు గా ఉద్యమాన్ని చేసి చివరికి రాష్ట్రాన్ని దక్కించుకున్నారు . ఐతే తెలంగాణా ఉద్యమంలో సమయం లో ఎన్నో జాక్ లు మొదలయ్యి ఉద్యమంలో పాలు పంచుకున్నాయి, ఐతే ఉద్యమ సమయంలో చాల ఆక్టివ్ గా ఉండి తర్వాత ప్రబుత్వం నుంచి ఫలాలు పొంది కొన్ని సంస్థలు వెనక్కి వెళ్లి పోయాయి ,తెలంగాణా ఏర్పడ్డాకా కూడా అలంటి కార్యక్రమాలు చేస్తే బంగారు తెలంగాణాఈజీ గా సాదించొచ్చు.
ఐతే ఒక సంస్థ మాత్రం స్వామి వివేకానంద గారి అడుగు జాడల్లో నడుస్తూ ,యువ వ్యవస్థ ని నిర్మాణం చేస్తూ ముందుకు వెళ్తుంది ,అదే TITA (Telangana Information Information Technology Association). ఉద్యమ నేపథ్యం లో ఆరంభం అయిన ఈ సాఫ్ట్ వేర్ జాక్ ,రాష్ట్ర అవిర్బం తర్వాత కూడా సేవలను కొనసాగిస్తుంది . ముఖ్యంగా యువ నిర్మాణ్ పేరిట నిర్వహిస్తున్న ప్రోగ్రాం కి చాల ప్రసంసలు వస్తున్నాయి . ఆంద్ర ప్రదేశ్ సంబందించిన మేధావులు ఐతే ఇలాంటి ప్రోగ్రాం ఒకటి వాళ్ళ రాష్ట్రం లో ఉంటె చాల బాగుంటుందని అంటున్నారు . ఇంజనీరింగ్ ,డిగ్రీ చదువుతున్న విద్యార్థులకి భవిష్యత్తు ని నిర్ణహించే క్లౌడ్ కంప్యూటింగ్ ,hadoop ,మొబైల్ టెక్నాలజీస్ ,డిజిటల్ మార్కెటింగ్,
ఈ -కామర్స్ లాంటి IT కోర్సులు ,కమ్యూనికేషన్ స్కిల్స్ ,ప్రాజెక్ట్ మేనజమేంట్ ,ట్రాఫిక్ రూల్స్ అవేర్నేస్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు . అంతే కాకుండా బతుకమ్మ లాంటి కార్యక్రమాలను IT ఉద్యోగులతో నిర్వహించి తెలంగాణా సంస్కృతి ని కాపాడే ప్రయత్నం చేసి అందరికి రోల్ మోడల్ గా నిలుస్తున్నారు .

TITA యువ నిర్మాణ్ కి సంబందించిన కొన్ని ముఖ్యమైన అంశాలు, విజయాలు
1) యువ నిర్మాణ్ జనవరి 2014 ప్రారంబం అయింది ,ఇప్పటి వరకు 50000 మంది విద్యార్తులకు వివిధ అంశాల్లో ట్రైనింగ్ చాలా తక్కువ కాలంలో ఇచ్చింది .
2) JNTU హైదరాబాద్ ,బాసర IIIT లాంటి సంస్తలు యువ నిర్మాణ కార్యక్రమాన్ని తమ అధికారిక విద్యార్ధి శిక్షణ కార్యక్రమంగా ప్రకటించింది.
3) సైబరాబాద్ పోలీసులతో కలిసి ట్రాఫిక్ తరగతులను విద్యార్తులకు నేర్పించే ప్రయత్నం చేసింది.
4) తెలంగాణా ఉద్యమ చరిత్ర పైన పోటి పరీక్షల పైన V .ప్రకశ్ గారు రాసిన “తెలంగాణా ఉద్యామాల చరిత్ర -రాష్ట్ర ఆవిర్భావం ” పుస్తకంలో TITA గురుంచి ప్రస్తావించారు.
5) చుక్కా రామయ్య ,డా . విరెందర్ ,కొండ విశ్వేశ్వర్ రెడ్డి లాంటి తెలంగాణా మేదావి వర్గం యువ నిర్మాణ్ ని భావి తెలంగాణా నిర్మాణ్ గా అబివర్నించారు.
స్వామి వివేకానంద గారి పుట్టిన రోజు అయినా జనవరి 12 న ప్రపంచ యువ దినోత్సవం గా జరుపుకుంటున్న సందర్బంలో దేశంలో ప్రతి రాష్ట్రానికి ఇలాంటి TITA లు ఉంటె భావి బారత నిర్మాణం బాగా జరిగి స్వామికి నిజమైన నివాళి ఇచ్సినవాళ్ళం అవుతాం
భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలనీ , మిగత వాళ్ళు కూడా వీళ్ళ లాగా ముందుకు వెళ్ళాలని కోరుకుందాం .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here