ఆదివారం కూడా హైటెక్ రోడ్లు కిక్కిరిసిపోయే విదంగా చేసిన ఐటి బోనాలు

0
1053

 

    హైటెక్ సిటీ అంటే సోమవారం నుంచి శుక్రవారం ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది. ఇక శని ఆదివారాలు ఐతే రోడ్ల పైన ఈగలు కనపడవు. అపుడపుడు సినిమా ఆడియో ఫంక్షన్ ఉన్నపుడు శిల్పకళావేదిక వద్ద అభిమానుల సందడి వలన కిక్కిరిసిపోయే జనం కనిపిస్తుంది. కాని ఈ ఆదివారం మాత్రం ఏ ఒక్క సినిమా ఫంక్షన్ లేకపోయినా కూడా మామూలు ఆదివారాలకు భిన్నంగా రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. దానికి కారణం తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలిజీ అసోసియేషన్ (టీటా ) వాళ్ళు నిర్వహియించిన బోనాల జాతరే.


 

    తెలంగాణ ఇన్ ఫర్మెషన్ టెక్నోలజీ అసోసియేషన్ (TITA) ఆధ్వర్యంలో ఈ రోజు (02 జులై 2017 ఆదివారం) హైటెక్ సిటీలోని సైబర్ టవర్స్ కి సమీపంలో ఉన్న చిన్న పెద్దమ్మ గుడిలో నిర్వహించిన బోనాల జాతర కన్నుల పండుగగా జరిగింది. తెలంగాణా సంస్కృతి సంప్రదాయలకి అనుగుణంగా ఆడపడుచులు బోనాలతో ఉరేగింపుగా వెళ్ళి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. ఈ ఊరేగింపులో పోతరాజుల విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

ఈ ఉత్సవాలకి రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహ రెడ్డి ,ఎంపి గుండు సుధారాణి, ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు ,ఎమ్మెల్సీ రాంచంద్రరావు, ప్రభుత్వ విప్ గొంగడి సునిత, మాజీ మంత్రి శ్రీధర్ బాబు, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాష్, C.విట్టల్, బివారేజ్ స్ కార్పొరేషన్ చైర్మన్ దేవి ప్రసాద్, హైదరాబాద్ మొదటి మహిళ బొంతు శ్రీదేవి, కార్పోరేటర్స్ హేమ సమల, జగదీశ్వర్ గౌడ్ , సింధు ఆదర్శ్ రెడ్డి,మూవీ ఆర్టిస్ అసోసియేషన్ (మా ) ఎగ్జిక్యూటివ్ సభ్యుడు,సంతోషం సినీ వార పత్రిక ఎడిటర్ సురేష్ కొండేటి, హైదరబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్ర మహిళా వెల్ఫేర్ ఆర్గనైజర్ సుశీల రెడ్డి, జగిత్యాల జిల్లా తెలంగాణ రాష్ట్ర మహిళా వెల్ఫేర్ ఆర్గనైజర్ ముల విజయా రెడ్డి , అత్తాపూర్ కార్పోరేటర్ రావుల విజయ జంగయ్య, TRS Youth Wing Leader రాహుల్ రావు తదితరులు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.

    ఈ బ్రహ్మాండమైన ఉత్సవ నిర్వహణను టీటా ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాల , వైస్ ప్రెసిడెంట్ రానా ప్రతాప్ బొజ్జం, జనరల్ సెక్రెటరీస్ శ్రీలత, అశ్విన్ మరియు ఆర్గనైజేషన్ సెక్రెటరీస్ రవీందర్ ర్యాడ, వివేక్ బొద్దం, విశ్వాక్ రెడ్డి లతో పాటు టీటా సభ్యులు అద్భుతంగా నిర్వహించారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here