టీటా బోనాల జాతరకు సర్వం సిద్దం

0
427
hyderabad bonala jatara
hyderabad bonala jatara
    తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండగను హైదరాబాద్ మహ నగరంతో పాటు తెలంగాణా అంతటా కన్నుల పండగగా నిర్వహిస్తారు. దీనిలో భాగంగా 02 జులై 2017 ఆదివారం రోజున హైటెక్ సిటీలో తెలంగాణ ఇన్ ఫర్మెషన్ టెక్నోలజీ అసోసియేషన్ (TITA) ఆధ్వర్యంలో నిర్వహించే బోనాల పండగకి టీటా ప్రతినిథులు సర్వం సిద్దం చేసారు.
    ప్రతి సంవత్సరం టీటా ఆద్వర్యంలో బోనాల జాతరను నిర్వహిస్తుండగా ఈ సారి జరిగే బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటా ప్రతినిథులు ప్రత్యేక ఏర్పాట్లను చేసారు. హైటెక్ సిటీ సైబర్ టవర్స్ కి సమీపంలోని చిన్న పెద్దమ్మ గుడిలో బోనాల జాతర నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో రాష్ట్ర మంత్రులు కూడ పాల్గొననున్నారు. ఈ ఉత్సవాలలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులందరూ పాల్గోని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీటా ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాల గారు , వైస్ ప్రెసిడెంట్ రానా ప్రతాప్ బొజ్జం గారు కోరారు. అలాగే ఈ కార్యక్రమాన్నికి సంబంధిన వివరాలను తెలంగాణ కబుర్లు.కం కి తెలియజేసారు. టీటా ప్రతినిథులు సైబర్ టవర్స్ ప్లెఓవర్ పై ఏర్పరచిన బోనాల జాతర బ్యానర్ చూపరులను ఆకట్టుకుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here