టీటా టి-హబ్ ల మద్య కుదిరిన అరుదైన ఒప్పందం

0
502

టి-హబ్ మొదలు పెట్టి ఏడాది అయిన సందర్బంగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (టీటా) ల మద్య ఈ రోజు చారిత్రాత్మకమైన ఒప్పందం కుదిరింది. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కాలంలో ఎక్కువ మంది వాణిజ్య వేత్తలను తయారు చేసే దిశగా టి-హబ్ సీఈఓ జయకృష్ణన్, టీటా అధ్యక్షుడు సందీప్ మక్తాల మధ్య ఎంవోయూ కుదిరింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో,విద్యార్థుల్లో స్టార్ట్ అప్ కంపెనీల ఏర్పాటుకు ఈ ఒప్పందం ఎక్కువ దృష్టి పెట్టింది. ఈ కార్యక్రమంలో టి హబ్ కో ఫౌండర్ శ్రీనివాస్ కొల్లిపర ,టీటా ఉపాధ్యక్షుడు రానా బొజ్జం పాల్గొన్నారు.
ఈ క్రింద ఈ ఒప్పందంలో ఉన్న ప్రధాన అంశాలు.

1) పేరుగాంచిన యూనివర్సిటీలు ,విద్యాలయాల్లో స్టార్ట్ అప్ ఇంక్యూబులెటెర్ కేంద్రాలకు కృషి.
2) సాంకేతిక నిపుణులను అవసర నిమ్మిత్తం పరస్పర మార్పిడి
3) టి-హబ్ లో జరిగే ప్రాజెక్ట్ ప్లానింగ్ ,ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో టీటా నుంచి సాంకేతిక నిపుణుల సేవలు ,సలహాలు తీసుకోవచ్చు.
4) తెలంగాణ జిల్లాల్లో స్టార్ట్ అప్ కంపెనీల ఏర్పాటుకు కావాల్సిన సెషన్స్ ని టి-హబ్,టీటా లు కలిసి నిర్వహిస్తారు.
5) సృజనాత్మకంగా ఆలోచించే వాళ్లకు సపోర్ట్ చేసి స్టార్ట్ అప్ ల ఏర్పాటు దిశగా వాళ్ళను ప్రోత్సహించటం.
6) స్టార్ట్ అప్ లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లతో పని చేస్తూ వాళ్లకు సలహాలు ఇవ్వటం.
7) రాబోయే 5 ఏళ్లలో 100 కు తగ్గకుండా స్టార్ట్ అప్ కంపెనీల ఏర్పాటుకు కృషి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here