ఈ తిక్క పక్కాగా చుక్కలు చూయిస్తుంది

0
705

మేనమామలు పోలికలతో హావభవాలతో ఇప్పటి వరకు ఫాన్స్ ని అలరించిన సాయి ధరమ్ తేజ్ మరియు ఓం అనే 3డి  సినిమాని తీసిన సునీల్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న  సినిమా తిక్క. ఎదో విదంగా మెగా హీరోల రిఫరెన్స్ ని వాడుకున్న సాయి ఈ సినిమాలో కేవలం పవన్ కళ్యాణ్ పంచ్ డైలాగ్ ని సినిమా టైటిల్ గా వాడుకున్న సాయికి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో చూద్దాం.

కథ
ఉద్యోగం చేస్తూ జీవితాన్ని హాయిగా తాగుతూ ఊగుతూ కాలం గడుపుతాడు ఆదిత్య (సాయిధరమ్ తేజ్) ,అది తండ్రి రాజేంద్ర ప్రసాద్ కూడా తాగుబోతే. ఒకానొక సమయంలో ఓ యాక్సిడెంట్ వల్ల తనకు పరిచయమైన అంజలి (లారిసా) వల్ల అతడి జీవితం మారిపోతుంది. ఆమె అతడి జీవితంలోకి వచ్చాక తన అలవాట్లన్నీ వదిలేయాల్సి వస్తుంది. ఐతే ఆది మీద తనకున్నంత ప్రేమ తన మీద అతడికి లేదంటూ అతణ్ని వదిలేసి వెళ్లిపోతుంది అంజలి. అదే రాత్రి అనుకోని పరిణామాలు జరుగుతాయి. ఆ రాత్రి ఎం జరిగింది ?ప్రేయసిని అతను మళ్లీ తిరిగి కలిశాడా లేదా అన్నది మిగతా కథ.

విశ్లేషణ

కొన్ని సినిమాలు కాంబినేషన్లు ,పేరున్న హీరోహీనుల తో వచ్చే సినిమాల వలన సినిమాకు ప్రీ పబ్లిసిటీ ఏర్పడి అందులో కొన్ని హిట్లు ఐతే మట్టుకు అవుతాయి. మరి కొన్ని సినిమాలు హీరో పేరు మీద లేదా అయన పాత సినిమాల సక్సెస్ గ్రాఫులతో కాంబినేషన్ లేకున్నా సరే హిట్ అవుతాయి. కానీ కొన్ని ఫెయిల్ అవుతాయి,అలాంటి సాయి ధరమ్ తేజ కి గత సినిమాల హిట్లు ఉండటం వలన పేరున్న హీరోహీనులు లేకున్నా కూడా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లేకున్నా కూడా అందరు సినిమా హిట్ అవుతుందని అనుకున్నారు ఎందుకంటే హీరో కు కథల పైన జడ్జిమెంట్ బాగుందని చిన్న నమ్మకం. కానీ ఈ తిక్క సినిమా మాత్రం అందరి అంచనాలు అందుకోకేలేక పడిపోయింది. అసలు సాయి కి కథల ఎంపిక అనేది యాదృచ్చికమే అనే విషయం తెలిసిపోయింది.

పేరుకు తగ్గట్టు సినిమా మొత్తం తిక్క కనిపిస్తుంది. కథలో ,కథనంలో,దర్శకత్వంలో ,స్క్రీన్ ప్లే లో ,మాటల్లో పాత్రల్లో,డాన్సులు,పోరాటాల్లో కూడా తిక్క కనిపిస్తుంది. కానీ ఆ తిక్క లెక్క లేకుండా పోయింది. నిజానికి థమన్ సంగీతం తప్పిస్తే సినిమాలో ఏమి లేదు.

ప్లస్ పాయింట్స్
థమన్ సంగీతం
మైనస్ పాయింట్స్
కథ
కథనం
పాత్రలు
సినిమా

రేటింగ్:1/5

Verdict:ఈ తిక్క పక్కాగా చుక్కలు చూయిస్తుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here