వారు భారతీయులే కానీ ప్రాథమిక హక్కులుండవు

1
2741

ఆశర్యపోతున్నారా?వారు భారతీయులే కానీ జనన ధృవీకరణ పత్రం ఉండదు,వారు భారతీయులే కానీ కుల ధృవీకరణ పత్రం ఉండదు,వారు భారతీయులే కానీ మత ధృవీకరణ పత్రం ఉండదు,వారు భారతీయులే కానీ స్థానికత ధృవీకరణ పత్రం ఉండదు.అంతెందుకు వారికి ఓటరు గా హక్కు ,ప్రపంచ దేశాలకు దీటుగా నందన్ నీలేకని ఆలోచనలతో పుట్టిన ఆధార్ కార్డు, విద్యా హక్కు ,స్కాలర్ షిప్ లేదు. వారికి తెలుగు రాష్టాల్లో ఆరోగ్య శ్రీ ఉండదు.విదేశాల్లో చదవాలంటే అక్కడి యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ వస్తుంది కానీ భారతదేశంలో పాస్ పోర్టు పుట్టదు.వారు ఏమైనా పరాయి దేశంలో పుట్టి, ఇక్కడ పౌరసత్వం పొందిన వారంటే అది కాదు ఎందుకంటే వాళ్ళ జన్మతః లో భారతీయత నిండివుంది. సరే వారేమైనా ఎవరికైనా ద్రోహం చేశారా అంటే నిజాయితీ తో నిండినా హృదయాలు వాళ్ళవి. తల్లి తండ్రులను కోల్పోయి ఎంతో   మనోక్షోభకి గురైన వాళ్ళకి ఈ దేశం కూడ వల్ల పైన చిన్న చూపు చూస్తూ వాళ్ళని అనాథలను చేసింది. మన దేశం లో పుట్టి, పెరిగి అయినవారు ఎవరో తెలియని అనాధ పిల్లలకు రాజ్యాంగ ప్రాథమిక హక్కులు లేవు అని ఎంత మందికి తెలుసు? మన దేశంలో ఉన్న 4 కోట్ల అనాధలకు ఎదగటానికి లేకుండా చేస్తున్న ఈ హక్కుల లేమి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఎవరైనా ఊహించగలరా?
ఇప్పటికే రోడ్డు పైన పడ్డ చాల మంది అనాధలకు నీడ ఇవ్వాల్సిన మనం ఇలాగె కూచొని టివి చూస్తూ గడిపేద్దామా?ఇటీవల రజిత అనే ఒక ఎన్.ఐ.టి లో చదివిన విద్యార్థి గోల్డ్ మెడల్ సాధించింది. పై చదువుల కోసం విదేశాల వెల్దామనుకున్న ఆమెకు జనన ధృవీకరణ పత్రం లేదనే కారణంతో పాసుపోర్టు రాలేదు. ఇలాంటి సంఘటనలు మన దేశంలో ఎన్నో కనపడతాయి,మరెన్నో సన్నివేశాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి.

దేవుడు మనుష్య రూపంలో ఉంటాడని మనం చాల సార్లు విన్నాం. కొన్ని సార్లు చూసాం . మరి వీళ్ళ కోసం దేవుడు ఏ రూపంలో వస్తాడో అని చాల మంది ఆనాధలు ఎదురుచూస్తున్న సమయంలో ఒక మహానుభావుడు వీళ్ళకి అండకు ఉంటూ వీళ్ళ తరపున న్యాయపోరాటం చేయటానికి ఒక ముందుకొస్తున్నాడు. ఈయన  సంక్షోభం లో ఉన్న పాండవ సేన కి ఒక రథసారథి అయినా శ్రీకృష్ణుడి రూపంలో ముందుకొస్తున్నాడు. ఆయన ఎవరో కాదు మా ఇల్లు అనే ఆశ్రమాన్ని నెలకొల్పి,
అనాధలకు బాసట గా ఉంటూ వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్న గాదె ఇన్నయ్య గారు.

2006 లో 32 మంది అనాధ పిల్లలతో వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జాఫర్గాద్ గ్రామా సమీపంలో ఈ ఆశ్రమాన్ని నెలకొల్పారు. ఇపుడు ఆ సంఖ్య కాస్త 300 ని తాకే విదంగా ఉంది. దాదాపు 1000 మంది అనాధ పిల్లల ను చదువు సంధ్యలను నేర్పించిన ఇన్నయ్య గారు ,ఇపుడు 6 ఎకరాల్లో ఇంటర్ కాలేజీ ,డిగ్రీ కాలేజ్ లను కూడా నెలకొల్పారు.

ఇటీవల 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న మా ఇల్లు ఇపుడు ఒక చరిత్రాత్మకైనా బిల్లు కోసం సన్నధం అవుతుంది. కరీంనగర్ పార్లమెంట్ శాసన సభ్యుడు శ్రీ వినోద్ కుమార్ బోయిన్పల్లి గారితో పార్లమెంట్ లో అనాధ పిల్లల కోసం ప్రాథమిక హక్కులను కల్పించటానికి పార్లమెంట్ ప్రైవేట్ బిల్లు ని ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టానికి ఇన్నయ్య గారు కృషి చేస్తున్నారు. ఈ బిల్లు న మద్దతు కోసం ఇన్నయ్య తొక్కని గడప లేదు అడగని నాయకుడు లేదు. ఈ బిల్లు పార్లమెంట్ లో పాస్ అయి భారతదేశంలో ఉన్న అనాధలకు బాసటగా నిలిచి ,వాళ్లకు బాసటగా ఉన్న ఇన్నయ్య గారి ఆశయం నెరవేరాలని ఆశిద్దాం. అనాథలకు కావాల్సింది జాలి, దయ, కరుణ, అయ్యోపాపం అనే మనస్సులు మనవి కావని కాదు… వాళ్ళని ఈ దేశంలో పుట్టినందుకు భారతీయులుగా గుర్తిస్తూ రాజ్యాంగం కల్పించాల్సిన హక్కులను సాధించే క్రమంలో తోడ్పడే వాళ్లమని నిరూపిద్దాం.అనాథలను ఆదుకొని ఆనాధలు కూడా సంచలనాలు సృష్టించే దేశంగా మారుద్దాం

Source:Vikram Velmala(Maa illu co-ordinator)

Author: Ravinder Ryada

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here