డ్రగ్స్ దందా అంతు తేల్చేందుకు మరిన్ని ఏర్పాట్లు…

0
277
The Special Investigation on drugs racket
The Special Investigation on drugs racket

డ్రగ్స్ అక్రమ రవాణాపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇవ్వడంతో డ్రగ్స్ దందా అంతు తేల్చేందుకు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తయారవుతున్నారు. డ్రగ్స్ దందాలో ముగ్గురు ప్రధాన నిందితులు కెల్విన్, అబ్దుల్ ఖుద్దుస్, అబ్దుల్ వాహిద్ ల రెండో రోజు కస్టడీ ముగిసింది. మరింత సమాచారం కోసం వారిని మరోసారి నిందితులను కస్టడీకి తీసుకోవాలని కస్టడీ ముగిసిన తర్వాత ముగ్గురు నిందితులకు ఉస్మానియా హాస్పిటల్ లో పరీక్షలు చేయించి జడ్జీ ముందు ప్రవేశపెట్టనున్నారు. డ్రగ్స్ వాడిన సినీ ప్రముఖులకు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేయాలని డ్రగ్స్ ను ఇండస్ట్రీకి అలవాటు చేసినోళ్లు… వ్యాపారానికి సాయం చేసిన వాళ్లపై కేసులు పెట్టాలని అనుకుంటున్నారు. సినీ ప్రముఖులపై కేసులు పెట్టేందుకు న్యాయ సలహా కూడా తీసుకుంటున్నారు. ఫిలిం ఇండస్ట్రీలో నోటీసులు వచ్చిన వారిని 19 నుంచి 27 వరకు ఇంటరాగేషన్ చేసేందుకు సిద్ధమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here