లాల్‌దర్వాజా బోనాలకు ముస్తాబయిన ఓల్డ్ సిటీ…

0
349
The Old City is adapted to the Lal Darwaza Bonas
The Old City is adapted to the Lal Darwaza Bonas
    హైదరాబాద్ బోనాల పండుగ సంబురాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు అధికంగా తరలివచ్చే లాల్ దర్వాజా సింహవాహిని ఆలయం, అక్కన్న మాదన్న, మీరాలంమండిలోని మహంకాళి ఆలయం, కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయాల దగ్గర అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి బోనాల సమర్పణకు వెళ్లే ప్రధాన ఆలయాలకు మార్గాలు, కాషాయ జెండాలు, ఫ్లెక్సీలు, రంగురంగుల విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. ఆషాడమాసం చివరి ఆదివారం కావటంతో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారికి బోనం సమర్పించేందుకు క్యూ కట్టారు. డప్పుల దరువులు, పోతరాజుల వీరంగాల మధ్య బోనాల పండుగ సంబురాలు అంగరంగ వైభవంగా సాగుతుంది.
    రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు పట్టు వస్ర్తాలు సమర్పిస్తారు. పాతబస్తీలో వైభవోపేతంగా జరిగే బోనాల పండుగకు ప్రభుత్వం ఐదున్నర కోట్ల రూపాయల నిధులతో 220 అభివృద్ధి, మరమ్మతు పనులు చేపట్టి పూర్తి చేశామని GHMC దక్షిణ మండలం జోనల్‌ కమిషనర్‌ ఎస్‌.శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. రూ.50 లక్షలతో తాత్కాలిక వీధిదీపాలను ఏర్పాటు చేసామని, ఆలయాల వద్ద 500 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియమించామని అంతేకాకుండా మూడు మొబైల్‌ శానిటేషన్‌ టీమ్‌లను కూడా ఏర్పాటు చేశామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here