దేశంలో హిందు చదవని రోజు

0
434

“ది హిందు ” ,ఈ పేరు తెలియని భారతీయుడు లేడు ,వార్తలు చదవని ఇంగ్లీష్ పాఠకుడు ఉండడు ,ఇండియా లో స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి ఒక ఇంగ్లీష్ పీడియా . బ్రిటష్ వాళ్లతో స్వతంత్ర ఉద్యమకారులకి ఒక భగవద్గీత . 1878 లో వార పత్రిక గా మొదలైన ఈ పత్రిక తర్వాత ఇండియా లో అతి పెద్ద దినపత్రిక గా పేరుగాంచింది . 1995 న్యూస్ వెబ్ సైట్ ని మొదలుపెట్టి ఇండియా లో మొదటి న్యూస్ పోర్టల్ గా రికార్డు లకేక్కింది . ఈ పత్రిక మొదలైన ఇప్పటివరకు ప్రత్యెక రోజులు ,పండుగ రోజులు తప్పించి ఒక్క రోజు కూడా ప్రింట్ ఆగలేదు . కాని బుదవారం మార్కెట్ లోకి రాలేదు దానిక్కారణం చెన్నై మీద విరుచుకుపడిన భారీ వర్షాలు . చెన్నై నగరానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో మరైమలైనగర్లో ఈ పత్రికకు ప్రింటింగ్ ప్రెస్ ఉంది. కురుస్తున్న వర్షాల కారణంగా ఉద్యోగులు అక్కడికి చేరుకోలేని పరిస్తితి . దీని వాళ్ళ ప్రింటింగ్ ఆగి తమిళనాడు లో కురుస్తున్న వర్షాలతో పాటు ది హిందూ పత్రిక కూడా చరిత్ర కి ఎక్కింది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here