భారత టెన్నిస్ కి స్విస్ బ్యాంకు వరం

0
415

 

1996 నుంచి ఒక  దశాబ్దం వరకు భారత్ టెన్నిస్ కి ఒక స్వర్ణయుగం లాగా  సాగింది ,  లియాండర్ పేస్ కి 1996 అట్లాంటా ఒలింపిక్స్ లో కాంస్యం వచ్చాకా భారత్ లో టెన్నిస్ కి కొంచెం ఊపు వచ్చింది ,క్రికెట్ గురుంచే కాకుండా టెన్నిస్ గురుంచి కూడా వార్తల్లో రాయటం మొదలు పెట్టారు . ఆ తర్వాత పేస్-భూపతి డబుల్స్ లో బాగానే అడి ,దాదాపు అన్ని గ్రాండ్ స్లామ్స్ గెలిచారు ,వీళ్ళు విడిపోయే సమయానికి సానియా మీర్జా ప్రవేశించి సింగిల్స్ లో టాప్-30 లోకి వెళ్ళింది. కాని ఫీట్ నెస్ సమస్యలు ,వివాదాలు ,మొదటి ఎంగేజ్మెంట్ రద్దు ,తర్వాత షోయబ్ మాలిక్ తో పెళ్లి ,స్వదేశంలో వ్యతిరేకత వాళ్ళ తన కెరీర్ లో గ్రాఫ్ పడిపోయింది.

తర్వాత పేస్ వెటరన్ క్రీడాకారిణి మార్టినా నవ్రతిలోవ తో జత కట్టి కొన్ని మిక్స్డ్ డబుల్స్ గెలిచినా పూర్తిగా కొనసాగించలేకపోయారు. మహేష్ కూడా అంతగా రాణించలేకపోయారు .
కాని గత ఏడాదిగా పేస్ ,సానియా లు చాల మంచి  ఫాం లో ఉన్నారు ,ముఖ్యంగా సానియా ఐతే తెలంగాణాకి బ్రాండ్ అంబసిదర్ గా ఎంపికయ్యాక దూసుకుపోతుంది ఐతే ఇక్కడ ఒక గమనించదగిన విషయం ఏంటంటే ఇద్దరికీ ఒక స్విస్ బ్యాంకు లాంటి అమ్మయి తో జత కట్టాకే ఈ విజయాలు దక్కుతున్నాయి ,ఆవిడా ఎవరో కారు మార్టినా హింగిస్. అతి చిన్న వయసులోనే ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచినా ఇవిడ కూడా టెన్నిస్ కి అతి చిన్న వయసులోనే దూరం అయింది ,తర్వాత రి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటింది,ఇప్పుడు మన వాళ్లతో డబుల్స్ ,మిక్స్ డ్  డబుల్స్ లో Wimbledon, US OPEN  సీజన్లో గెలిచి చరిత్ర రాసారు
భారతీయులకి స్విస్ బ్యాంకులే కాదు స్విస్ అమ్మాయిలు కూడా కలిసోస్తున్నరన్న మాట ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here