రాఖి పౌర్ణిమ రోజున పుష్కరాలు జరుపుకుంటున్న అక్క తమ్ముళ్ల సినిమా

0
1834

దశాబ్దకాలం కంటే ముందు మహేష్ బాబు ,గుణ శేఖర్ ల కాంబినేషన్ లో అర్జున్ అనే సినిమా వచ్చింది. అంతకుముందు ఒక్కడు హిట్ తర్వాత వచ్చిన ఇద్దరి సినిమా అది. భారీ అంచనాలతో రమేష్ బాబు నిర్మాతగా ,తోలిప్రేమ ఫేమ్ కీర్తి రెడ్డి మహేష్ అక్క పాత్రలొ ,మరో చరిత్ర ఫేమ్ సరిత ముఖ్య పాత్రలో,మధుర మీనాక్షి గుడి భారీ సెట్ ని హైదరాబాద్ పొలిమేర లో 2 కోట్ల వేసి తీసిన సినిమాగా విడుదల అయింది. అక్క తమ్ముల సెంటిమెంటుతో విడుదలైన ఆ సినిమా అంచనాలను అందుకోకోపొయినా కూడా మంచి సిస్టర్ సెంటిమెంట్ సినిమా గా ఇప్పటికి టీవీల్లో ప్రేక్షాదరణ పొందుతుంది.

ఐతే అన్నదమ్ముల అనుబంధానికి అద్దం పట్టిన ఆ సినిమా,12 ఏళ్ల తర్వాత కూడా ఒక అరుదైన ఘనత ని సాధిస్తుంది. అదేంటంటే రేపటికి అంటే రక్షా బంధన్ రోజుకి ఆ సినిమా విడుదల అయి సరిగ్గా 12 ఏండ్లు అవుతుంది. ఈ విషయాన్నీ సీనియర్ సినిమా జర్నలిస్ట్ బిఏ రాజు ట్విట్టర్ లో పెర్గోన్నాడు. నిజంగా ఇలాంటి అరుదైన సంఘటన జరగటం విశేషమే కదా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here