నకిలీ వీసా కేసులో అడ్డంగా దొరికిన తెలుగు ప్రవాస భారతీయుడు

0
494

అమెరికా అంటే చాల మందికి స్వప్నం. ప్రధానంగా ప్రతి ఐటి ఉద్యోగి అమెరికా కి వెళ్లి తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదించి స్వదేశానికి తిరిగొచ్చి ఏదైనా వ్యాపారం అయినా లేక ఉద్యోగం చేసి జీవితంలో స్థిరపడి పోవాలని ఆశిస్తారు. కానీ ఒక్కోసారి ఆ ఆశ అత్యాశ గా మారి అడ్డదారులు తొక్కి దొరికిపోతుంటారు. కొందరు అవకాశాల కోసం ఎదురు చూస్తుంటే మరి కొందరు మాత్రం వచ్చిన అవకాశాలను దుర్వినియోగ పరుస్తూ దేశ పరువు తీస్తారు. అలాంటి వాళ్లలో ఇపుడు 45 ఏళ్ల తేజేష్ కొడాలి అనే ఎన్నారై చేరిపోయాడు. ఈయన రెండు మిడిలెసెక్స్ కౌంటీ సంస్థలకు సీఈవో గా పనిచేస్తున్నాడు.

అసలు విషయానికొస్తే అతను కొందరు విదేశీయులకు 37 దొంగ స్టూడెంట్ వీసాలు సమకూర్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. కొన్ని అమెరికా కంపెనీలకు విదేశీయుల్ని ఐటీ కన్సల్టంట్లుగా పరిచయం చేసినందుకు తనకు కమిషన్లు అందేవని తేజేష్ ఒప్పుకున్నాడు. అతడి కంపెనీ తరఫున 37 దాకా నకిలీ స్టూడెంట్ వీసాల్ని తయారు చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ నేరం రుజువైతే తేజేష్ కు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు భారీగా జరిమానా కూడా పడేందుకు అవకాశం ఉంది.ఈ సంఘటన తోనైనా అమెరికా వెళ్లిన మనోళ్లు బుద్దిగా తమ పని టీము చేసుకుంటే జీవితాలను నాశనం చేసుకునే అవకాశం ఉండదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here